భారత సినిమా రంగానికి అపారమైన సేవలందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్‌గా, బాలీవుడ్ హీ-మ్యాన్‌గా గుర్తింపు పొందారు.
Read Also: Dharamendra: లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు!

1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం
ధర్మేంద్ర (Dharmendra) అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్ నూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: