టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి రేపుతున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit). రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే విశేష చర్చకు దారి తీసింది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టించిన సందీప్ వంగా, ప్రభాస్‌ను ఈ సారి ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
Read Also: Kaantha Movie: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ రిలీజ్
ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ పనులు (Pre-production work) ముగించుకున్న చిత్ర బృందం ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసింది. ఈ నెల చివరికల్లా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి (Tripti Dimri) నటిస్తుండగా, ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఎవరు, ఎలా కనిపిస్తారన్న దానిపై భారీ ఆసక్తి
ముఖ్యంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) విలన్‌గా నటిస్తుండటం, కొరియా నటుడు డాన్ లీ (Don Lee) కూడా కథలో భాగమవుతుండటం చిత్రం స్థాయిని మరింత పెంచింది. సందీప్ సినిమాల్లో యాంటగనిస్ట్ పాత్రకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రేక్షకులు తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’ (Spirit) లో ఎవరు, ఎలా కనిపిస్తారన్న దానిపై భారీ ఆసక్తి నెలకొంది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర రూమర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దగ్గుబాటి కుటుంబానికి హీరో ఒకరు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఆయనే దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram).
కీలక పాత్రలో దగ్గుబాటి అభిరామ్
తాను కనిపించే రోల్‌కు యారోగెన్సీ, ఓవర్ యాటిట్యూడ్, పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, కథలో ఈ పాత్రకు మంచి వెయిట్ ఉండటంతో దర్శకుడు సందీప్ స్వయంగా అభిరామ్‌ను అప్రోచ్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్, రానా ఇప్పటికే విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తుండగా, అభిరామ్ మాత్రం తన మొదటి చిత్రం ‘అహింస’ (దర్శకుడు తేజ)తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ సినిమా విడుదలైపోయిందనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవడం ఆయన కెరీర్ స్తబ్దతకు కారణమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: