భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, క్రికెటర్ అనిరుద్ధ శ్రీకాంత్ (Anirudha Srikkanth) ఓ ఇంటివాడయ్యాడు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్, నటి సంయుక్త షణ్ముగనాథన్‌తో గురువారం (నవంబర్ 27) ఆయన వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది.
Read Also: Laura Wollwardt: సౌతాఫ్రికా కెప్టెన్ కు లారా వోల్వార్డ్ట్ రికార్డ్ ధర
నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
పెళ్లి తర్వాత ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను, పెళ్లికి సిద్ధమవుతున్న వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో సంయుక్త స్నేహితురాలు, ప్రముఖ టీవీ ప్రజెంటర్ భావన బాలకృష్ణన్ మాట్లాడుతూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. “కొన్నిసార్లు భిన్న మనస్తత్వాలు ఆకర్షితులవుతాయి. కొన్నిసార్లు ఒకేలాంటి వాళ్లు కలుస్తారు.
కానీ, స్నేహితులుగా ఒకరికొకరు తోడుగా నిలిచి, ఒకరినొకరు ఓదార్చుకున్న జంట అనిరుద్ధ, సంయుక్త. మీ ఇద్దరికీ అందమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను” అని ఆమె అన్నారు.కాగా, సంయుక్త తమిళ బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె ‘మద్రాస్ మాఫియా కంపెనీ’ అనే తమిళ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి, ఆకట్టుకుంది.మరోవైపు, అనిరుద్ధ (Anirudha Srikkanth) క్రికెటర్‌గా, స్పోర్ట్స్ కామెంటేటర్‌గా రాణిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: