హైదరాబాద్ : ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
హైదరాబాద్ : వేతనాల పెంపు తదితర సమస్యలపై తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని కార్మికులు సమ్మెన కొనసాగిస్తున్న నేపధ్యంలో ఎట్టకేలకు 15 శాతం మేర పెంచుతూ ఫిల్మ్ ఛాంబర్(Film chamber) ఆదివారం కీలక నిర్ణయం తీసు కుంది, తమ కష్టానికి తగిన వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ కార్మికులు బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే.
కార్మికుల డిమాండ్ – 30% వేతనాల పెంపు
30 శాతం వేత నాలు పెంచుతూ నిర్మాతలు ప్రకటన చేసే వరకు తాము షూటింగ్లలో పాల్గొనబోమని ఈ నెల 3న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. అనంతరం 4వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించి, దాన్ని కొనసాగిస్తు న్నారు.
ఈ సమ్మె విషయమై వివిధ అంశాలపై ప్రొడ్యూసర్లు, కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో కార్మికులు(Cinema Workers) సమ్మెను ఇంకా కొనసాగిస్తున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన
అయితే ఎవరూ ఊహించని విధంగా ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన చేసింది. 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఉదయం కార్మిక సంఘాలకు ఫిల్మ్ ఛాంబర్ లేఖలు పంపింది.
అయితే మొదటి నుంచి 30 శాతం వేతనాల పెంపుకు డిమాండ్ చేస్తున్న సినీ కార్మికులు(Cinema Workers).. 15 శాతం వేతనాల పెంపు నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తారనేది చర్చనీ యాంశమైంది.
తెలుగు సినీ కార్మికులకు ఎంత శాతం వేతనాల పెంపు ఇచ్చారు?
ఫిల్మ్ ఛాంబర్ 15% వేతనాల పెంపును ప్రకటించింది.
సినీ కార్మికులు మొదట ఎంత శాతం వేతనాల పెంపు డిమాండ్ చేశారు?
కార్మికులు మొదట 30% వేతనాల పెంపు కోరారు.
సినీ కార్మికుల సమ్మె కారణంగా సినిమా షూటింగ్స్‌పై ఎలాంటి ప్రభావం పడింది?
సమ్మె కారణంగా పలు సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: