మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెగాస్టార్ కెరీర్‌లో 157వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక కథతో రూపొందుతోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార, క్యాథరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read also: Ekō Ending Explained : చివరి ట్విస్ట్ ఇదేనా? క్లైమాక్స్ అర్థం ఇదే

చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్ ట్రైలర్ రిలీజ్
సినిమాటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి నిర్వర్తిస్తుండగా, ఎడిటింగ్ తమ్మిరాజు, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. వీటీవీ గణేశ్, హర్షవర్ధన్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. (Chiranjeevi) ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ఈరోజు తిరుపతిలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ట్రైలర్ అంతటా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి టైమింగ్ హైలైట్‌గా నిలిచాయి. చిరంజీవి తన వింటేజ్ కామెడీ అండ్ యాక్షన్ మేనరిజమ్స్‌తో అభిమానులను అలరించారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రైలర్ చివరిలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశం థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: