స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆమె మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమైన మన శంకర వరప్రసాద్ గారులో ప్రత్యేక గీతంలో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
Read Also: Keerthy Suresh: ఎట్టకేలకు ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్ ఫిక్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, ప్రస్తుతం ప్రత్యేక సెట్ నిర్మాణం జరుగుతోందట. అదే సెట్‌లో తమన్నా పాల్గొనే స్పెషల్ సాంగ్ షూట్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
మెగాస్టార్ – తమన్నా కాంబినేషన్‌పై భారీ అంచనాలు
Keerthy Suresh: ఎట్టకేలకు ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్ ఫిక్స్చిరంజీవి( Chiranjeevi) – తమన్నా(Tamanna) కాంబినేషన్ ఇప్పటికే భోళా శంకర్లో కనిపించినప్పటికీ, ఈసారి మాస్ నంబర్‌లో ఇద్దరూ స్క్రీన్‌పై మెరవడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ సాంగ్‌కి టాప్ కొరియోగ్రాఫర్‌ను ఎంపిక చేశారని, ఇది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. తమన్నా ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తుండగా, ఈ స్పెషల్ సాంగ్ ఆమె కెరీర్‌లో మరో మాస్ హిట్‌గా నిలిచే అవకాశముందని ఫిల్మ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సాంగ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
ఇప్పటివరకు ఈ వార్తపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సినిమా యూనిట్ నుండి త్వరలోనే సాంగ్ వివరాలు, మ్యూజిక్ కంపోజర్, షూటింగ్ తేదీల గురించి సమాచారం వెలువడే అవకాశముందని టాలీవుడ్ టాక్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :