మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు జోడీగా క్యాథరిన్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ లేటెస్టుగా మరో అప్డేడ్ ను అందించారు.
Read Also: H. Vinod: జననాయకన్ రీమేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ప్రత్యేక శ్రద్ధ
తాజాగా మూవీ రిలీజ్‌కి కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉందని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. ఇందులో చిరు (Chiranjeevi) కొబ్బరి బోండం తాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిరు ఫ్యాన్స్ ఈ పోస్టర్‌ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

చిరంజీవి గత చిత్రం ‘భోళా శంకర్’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ కలిగించిన నేపథ్యంలో ఈసారి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి చిత్రాల్లో బలమైన సెంటిమెంట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటు ఉండదు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోపై అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: