బాక్సాఫీస్ వద్ద ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటికప్పుడు అందిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఓ భావోద్వేగభరిత సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్(Emotional Post) చేశారు.
Read Also: NTR: ‘దండోరా’ సినిమా టీం పై ఎన్టీఆర్ ప్రశంసలు

తెలుగు ప్రేక్షకులే నా బలం
దశాబ్దాలుగా తన సినీ ప్రయాణానికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెరపై తనను చూసి అభిమానులు వేసే విజిల్స్, చప్పట్లే తనకు ముందుకు వెళ్లే ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. రికార్డులు రావచ్చు, పోవచ్చు కానీ అభిమానుల ప్రేమ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. చివరగా అందరికీ ప్రేమతో “లవ్ యూ ఆల్” అని తన సందేశాన్ని ముగించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: