మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవర ప్రసాద్’ నుండి రెండో పాట ‘శశిరేఖ’ అధికారికంగా ఈ నెల 8న రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో రెండు రోజుల ముందుగా, అంటే ఈ నెల 6న అభిమానుల ముందుకు రానుంది. ఇదిలా, ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘మీసాల పిల్ల’ చార్ట్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో రెండో పాటపై అంచనాలు మరింత పెరిగాయి.
Read also: విజయ్ దేవరకొండతో పెళ్లి అంటూ ప్రచారం.. రష్మిక ఏమందంటే?

సినిమా వివరాలు , నటీనటులు
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని(Chiranjeevi) అందిస్తున్నారు. భారీ తారాగణం మరియు ప్రముఖ సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: