హైదరాబాద్ లులూ మాల్‌లో ‘రాజా సాబ్’ సినిమా రెండో పాట రిలీజ్ ఈవెంట్ అనంతరం, నటి నిధీ అగర్వాల్‌ను అభిమానులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. సెల్ఫీలు తీసుకోవాలనే ఆత్రుతతో వందల సంఖ్యలో ఎగబడటంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బాడీగార్డుల సహాయంతో అతికష్టం మీద బయటపడిన నిధీ, నిరుత్సాహంతో కారులో వెళ్లిపోయారు.
Read Also: Nidhi Agarwal: ‘రాజా సాబ్’ ఈవెంట్‌లో అసౌకర్యానికి గురైన నిధి
శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, ప్రముఖులు స్పందించారు. గాయని చిన్మయి (Chinmayi) శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు. ఇది వేధింపు కాదా?” అని తన ఎక్స్ ఖాతాలో చిన్మయి (Chinmayi) పోస్ట్ చేశారు. మరోవైపు, ఈవెంట్ నిర్వాహకుల తీరును కూడా పలువురు తప్పుపట్టారు. “తప్పు జనాలది కాదు, సినిమా టీమ్‌దే. ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారు? ఇది చాలా పేలవమైన నిర్వహణ” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. “వీళ్లు అభిమానులు కాదు, అభిమానుల ముసుగులో ఉన్న రాబందులు” అంటూ మరికొందరు మండిపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: