
మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా చిన్మయి మార్ఫ్ వీడియోలు, ఫోటోల గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్మయి (Chinmayi Sripada) తన మార్ఫింగ్ ఫొటోను, దాన్ని షేర్ చేసిన ఎక్స్ అకౌంట్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. దానిపై పోలీసులకు కంప్లయింట్ చేసినట్లుగా తెలిపారు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుని గత కొన్ని వారాలుగా తనని అసభ్యకరమైన పదజాలంతో తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ చిన్మయి ఓ వీడియో పంచుకున్నారు.
Read Also: Akhanda-2: అఖండ-2పై టీజీ హైకోర్టులో పిటిషన్
మా కుటుంబాన్ని వేధించడానికి డబ్బు తీసుకుంటున్నారు
“ఈరోజు నాకు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన ఫోటో వచ్చింది. నేను దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్నది ఇక్కడ విషయం కాదు. కానీ గత 8-10 వారాలుగా మా కుటుంబాన్ని వేధించడానికి డబ్బు తీసుకుని ఈ పని చేస్తున్న, వ్యక్తుల నుండి అమ్మాయిలను, వారి కుటుంబాలను కాపాడటానికి నేను ఈ వీడియో చేశాను” అని చిన్మయి (Chinmayi Sripada) పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: