కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara) కు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ముఖ్యంగా, ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పాట ‘బ్రహ్మ కలశ’ (‘Brahma Kalasha’) ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట శక్తివంతమైన సంగీతంతో, భక్తితో కూడిన శివుడి ఆరాధనకు సంబంధించినది, అది వినేవారికి ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.
Tollywood: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ సినిమా మొదటి భాగంలో క్లైమాక్స్‌లో వచ్చే ‘వరాహరూపం’ పాట ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. అదే తరహాలో, ఈ ప్రీక్వెల్‌లో కూడా శక్తివంతమైన పాటను మేకర్స్ చేర్చారు.ఈ పాట వింటుంటేనే మొదటి భాగంలోని ‘వరాహరూపం’ పాట (‘Varaharoopam’ Song) ఇచ్చే అనుభూతిని గుర్తు చేస్తోందని అభిమానులు అంటున్నారు.
ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. అబ్బి వి పాడాడు. రిషబ్ శెట్టి మార్క్ మేకింగ్‌తో, అజనీష్ లోక్‌నాథ్ సంగీతంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: