విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌కు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులతో వరుసగా వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదల జాప్యంపై విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్.ఎ. చంద్రశేఖర్ (Chandrasekhar) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఎలాంటి సవాళ్లకూ భయపడే వ్యక్తి కాదని, ఎదురయ్యే ప్రతి అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొనే నాయకత్వ లక్షణం తన కుమారుడికి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Dheekshith Shetty: ‘శబర’ టీజర్ అవుట్.. అదరగొట్టిన విజువల్స్!

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రారంభ దశలో ఇలాంటి అవరోధాలు సహజమే
కరూర్‌లో జరిగిన పరిణామాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు. విజయ్ దేనికీ భయపడడని చెప్పారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రారంభ దశలో ఇలాంటి అవరోధాలు సహజమేనని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి ‘జన నాయగన్’ ఎందుకు రిలీజ్ కాలేదో ప్రజలకు తెలుసునన్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువత రాజకీయాలపై చర్చ మొదలుపెట్టిందని, ఈ విషయంలో తన కంటే వారికి స్పష్టత ఎక్కువగా ఉందని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: