శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందD సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు. దాదాపు 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఛాంపియన్ సినిమా (Champion Movie) తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.’సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌ను రూపొందించిన ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకుడు.
Read Also: Eesha Movie: ఈషా మూవీ రివ్యూ
రూ.16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా (Champion Movie) పై ముందు నుంచి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు గట్రా ఈ మూవీపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఛాంపియన్’ సినిమా విడుదల కాకముందే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను ఒక సంస్థ దాదాపు రూ.16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: