నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా, మాస్ దర్శకుడిగా పేరుగాంచిన బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు వాయిదాల తర్వాత విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి, మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ‘అఖండ 2’ సినిమాపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే పాజిటివ్ టాక్‌తో పాటు, కొంతమంది నెటిజన్లు సినిమాలోని కొన్ని సన్నివేశాలు లాజిక్స్‌కు అతీతంగా ఉన్నాయంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రోలర్స్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. సినిమాలో లాజిక్ లేదన్న ఆరోపణలను బోయపాటి పూర్తిగా ఖండించారు. తాను కథను రాసుకునే సమయంలో ప్రతి అంశాన్ని లాజిక్‌కు లోబడి డిజైన్ చేశానని ఆయన తెలిపారు. సినిమా అన్నాక అందరికీ ఒకేలా నచ్చాల్సిన అవసరం లేదని, ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవడం సహజమని అన్నారు.
Read also: Lavanya Tripathi: లావణ్య బర్త్ డే.. ఫోటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్

ప్రతి సన్నివేశానికి ఓ కారణం ఉంటుందని స్పష్టం: బోయపాటి
అయితే విమర్శలు చేసే వారు సినిమాలోని నేపథ్యాన్ని, చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. (Boyapati Srinu)తాను ఎక్కడా నిర్లక్ష్యంగా కథను రాయలేదని, ప్రతి సన్నివేశానికి ఓ కారణం ఉంటుందని స్పష్టం చేశారు.అఖండ పాత్రకు సంబంధించిన అష్టసిద్ధి అంశంపైనా బోయపాటి వివరణ ఇచ్చారు. అష్టసిద్ధి సాధన అనేది కొన్ని రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దానికి దాదాపు 14 నుంచి 16 ఏళ్ల పాటు కఠినమైన సాధన అవసరమవుతుందని ఆయన తెలిపారు. ఆ సాధన పూర్తయిన తర్వాత సాధకుడికి దైవ శక్తులు లభిస్తాయని చెప్పారు. సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్‌ను చూపించామని, అఖండ అష్టసిద్ధి సాధన పూర్తి చేసుకున్న తర్వాత అతడి స్పర్శకే అసాధారణమైన పరిణామాలు జరుగుతాయన్న సంకేతాలను ముందుగానే ఇచ్చామని అన్నారు. ఈ పాయింట్‌ను గమనించకుండా కేవలం కొన్ని సన్నివేశాలను తీసుకుని ట్రోలింగ్ చేయడం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: