Border 2 OTT release: సినిమా ప్రియులకు, ముఖ్యంగా దేశభక్తి చిత్రాలను ఇష్టపడే వారికి ఒక అదిరిపోయే వార్త. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన యుద్ధ ప్రాతిపదికన సాగే చిత్రం ‘బోర్డర్ 2’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్, థియేటర్లలో రికార్డులను తిరగరాసి, ఇప్పుడు నేరుగా మీ ఇంటికే రాబోతోంది.
Read Also :Peddi Movie Update: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి క్రేజీ అప్డేట్

బాక్సాఫీస్ వద్ద రూ.480 కోట్లు కొల్లగొట్టిన దేశభక్తి చిత్రం
1997లో విడుదలైన ఐకానిక్ చిత్రం ‘బోర్డర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, 2026 జనవరి 23న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ వంటి అగ్ర తారలు నటించి మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే, 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. భారత దేశాన్ని దెబ్బతీయాలని పాకిస్థాన్ పన్నే కుట్రలను మన త్రివిధ దళాలు ఎలా తిప్పికొట్టాయనేది ఇందులో అద్భుతంగా చూపించారు. ఆర్మీ నుంచి లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ ఖేల్కర్ (సన్నీ డియోల్), నేవీ నుండి లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్ (అహాన్ శెట్టి), ఎయిర్ ఫోర్స్ నుండి నిర్మల్ జీత్ సింగ్ (దిల్జీత్ దోసాంజ్) శతృవులను ఎలా మట్టి కరిపించారో ఈ సినిమాలో చూడవచ్చు.
రూ.480 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో 2026లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ‘బోర్డర్ 2’ నిలిచింది. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు జేపీ ఫిల్మ్స్ ఉమ్మడిగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మోనా సింగ్, సోనమ్ బజ్వా కీలక పాత్రల్లో నటించారు. దేశభక్తి ఉప్పొంగే సన్నివేశాలు, యుద్ధ భూమిలోని పోరాట ఘట్టాలతో సాగే ఈ చిత్రాన్ని వెండితెరపై మిస్ అయిన వారు మార్చి 20 నుండి ఓటీటీలో వీక్షించవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :