చెన్నై (Chennai) లో ప్రముఖ సినీ నటుడు ప్రభు నివాసానికి, అలాగే అమెరికా రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్‌తో తమిళనాడు (Tamil Nadu) పోలీసులు అప్రమత్తమయ్యారు.తమిళనాడు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఓ ఈమెయిల్‌లో ఈ బెదిరింపులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Read Also: AP Crime: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువతి ఆత్మహత్య
చెన్నై (Chennai) లోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అమెరికా కాన్సులేట్‌లో, ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో బాంబు పేలుతుందని దుండగులు హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే చెన్నై పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో రంగంలోకి దిగారు.
అమెరికా కాన్సులేట్ భవనం, నటుడు ప్రభు (Actor Prabhu) నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి క్షుణ్ణంగా గాలించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు.

కేవలం ఆకతాయిల చర్యగా భావిస్తున్నామని
ఇదే క్రమంలో అమెరికా కాన్సులేట్ (American Consulate) లో పనిచేసే మరికొందరు అధికారులతో పాటు, నటుడు ఎస్.వి. శేఖర్, మైలాపూర్‌లోని సుబ్రమణ్యస్వామి నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.అయితే, అన్ని చోట్లా తనిఖీలు పూర్తి చేసి, ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు.
ఇది కేవలం ఆకతాయిల చర్యగా భావిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ వరుస బెదిరింపులతో కొద్దిసేపు నగరంలో తీవ్ర ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: