Bollywood Box Office 2025 : సంవత్సరం బాలీవుడ్‌కు ఆశ్చర్యాల సంవత్సరం అని చెప్పాలి. భారీ బడ్జెట్‌తో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా, కొన్ని అనుకోని విజయాలు మాత్రం పరిశ్రమకు ఊపిరి పోశాయి. ముఖ్యంగా సయ్యారా సినిమాతో రొమాన్స్ జానర్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం గమనార్హం. అదే సమయంలో ధురంధర్ లాంటి సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ సంచలన విజయం సాధించింది.
ఈ ఏడాది బాలీవుడ్‌లో దాదాపు 54 ప్రధాన సినిమాలు విడుదలయ్యాయి. వీటన్నింటి కలిపిన మొత్తం వసూళ్లు సుమారు రూ.4,620 కోట్లకు పైగా ఉన్నాయి. (Bollywood Box Office 2025) అయితే, అందులో టాప్ 10 సినిమాల వాటానే దాదాపు రూ.3,113 కోట్లుగా ఉండటం గమనించాల్సిన విషయం. మొత్తం సినిమాల్లో కేవలం 13 మాత్రమే హిట్ లేదా సక్సెస్‌గా నిలవగా, మిగిలిన 41 సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
2025లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రం రణవీర్ సింగ్ నటించిన ధురంధర్. ఈ సినిమా కేవలం 25 రోజుల్లోనే రూ.741.90 కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇంకా థియేటర్లలో ప్రదర్శన కొనసాగుతుండటంతో, త్వరలోనే పుష్ప 2 రికార్డును (రూ.836.09 కోట్లు) దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఒక్క భారీ విజయం వల్లే 2025 బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: