బిగ్‌బాస్(Telugu Bigg Boss-9) హౌస్‌లో రీతూ–పవన్‌ల మధ్య సంబంధం రోజురోజుకూ సంక్లిష్టమవుతోంది. వీరి మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు పూర్తిగా విరుగుడు దశకు చేరినట్టుగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్‌లోనూ వీరి మధ్య చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి.
Read Also: R. J. Surya: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆర్. జే సూర్య

తాజా ఎపిసోడ్‌లో నామినేషన్ల(Telugu Bigg Boss-9) సమయంలో మాధురి, పవన్‌పై ప్రశ్నలు వర్షం కురిపించింది. “నీకోసం నేను వాదిస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు?” అని వరసగా ప్రశ్నించడంతో పవన్ అసహనానికి గురయ్యాడు. తనను ఆమె అక్కలా భావిస్తానని, అందుకే స్పందించలేదని చెప్పాడు. కానీ ఈ సమాధానం రీతూని మరింత కోపానికి గురి చేసింది. ఆవేశంలో పవన్ “చాలు, గుడ్‌బై” అంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా, రీతూ వెనక్కి తగ్గకుండా అక్కడి నుంచే వెళ్లిపోయింది. ఈ సంఘటనతో హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కింది.
ఇక మాధురి మాత్రం వీరి మధ్య మధ్యవర్తిగా మాట్లాడేందుకు ప్రయత్నించింది. “మీరిద్దరి రిలేషన్ నిజంగా హెల్తీ అయితే, ఆమె కుటుంబం నాకు ఫోన్ చేసి ఏడవమంటారా?” అంటూ ప్రశ్నించింది. తన మాటల్లో తప్పుంటే క్షమించమని కూడా చెప్పింది. అయినా రీతూ–పవన్ గొడవ ఆగలేదు. చివరికి ఎప్పటిలాగే రీతూ తిరిగి పవన్‌కు తినిపించడం, అతనితో మళ్లీ మాట్లాడడం జరిగింది. అయితే వీరి ఈ తరచూ జరిగే గొడవలు ప్రేక్షకులను విసిగిస్తున్నాయి. ఫ్యాన్స్ కామెంట్ల ప్రకారం – “ఇద్దరూ విడిపోబోతున్న జంటలా ప్రవర్తిస్తున్నారు” అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: