బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశలోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్, డిసెంబర్ 21 ఆదివారం ఫైనల్ ఎపిసోడ్‌తో ముగుస్తుంది. గతంలా ఈసారి కూడా ప్రముఖులు, కామనర్లు హౌస్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. చివరి దశలో ఐదుగురు టాప్ కాంటెస్టెంట్లు రైలింగ్‌లో నిలిచారు.

టాప్ 5 కాంటెస్టెంట్లు & ఓటింగ్ పరిస్థితి
ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు టాప్ మెంబర్స్ ఇలా ఉన్నారు:
- ఇమ్మాన్యుయేల్
- తనూజ
- సంజన
- డీమన్ పవన్
- కళ్యాణ్
వీరిలో ఒకరు విన్నర్గా ఎంపిక కావనున్నారు. సోషల్ మీడియాలో కళ్యాణ్ లేదా తనూజ పై పెద్ద చర్చ నడుస్తోంది. ఓటింగ్ ప్రకారం కూడా కళ్యాణ్, తనూజ పోటాపోటీగా ఉన్నారని టాక్ ఉంది.
ఫైనల్ గెస్ట్ – ప్రభాస్ సర్‌ప్రైజ్
ప్రతి సీజన్‌లో విన్నర్‌ను ప్రకటించడానికి ఒక బిగ్ సెలబ్రెటీను(Special Guest) ఆహ్వానించడం ఆనవాయితీ. గతంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఆహ్వానంలో హాజరయ్యారు. ఈసారి బిగ్‌బాస్ టీమ్ అనూహ్యంగా రెబల్ స్టార్(Special Guest) ప్రభాస్ను ఫైనల్ స్టేజ్‌కి తీసుకురావనుంది. ఇది అభిమానులకు అదనపు సర్‌ప్రైజ్‌గా మారనుందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: