సోషల్ మీడియా వేదికలో ఒకప్పుడు ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ అనే పేరుతో విపరీతంగా పాపులర్ అయిన వ్యక్తి రమ్య మోక్ష.అదే సమయంలో ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు బిగ్ బాస్ (Bigg Boss 9) టీమ్ ఆమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం ఇచ్చింది.ఐదో వారం వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. రెండు వారాలే హౌజ్‌లో ఉండి బయటకు రావాల్సి రావడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు.
Read Also: Bigg Boss 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ .. రమ్య మోక్ష అవుట్
ఎలిమినేషన్ సందర్భంగా నాగార్జున అడిగిన ప్రశ్నలకు రమ్య ఓపెన్‌గా సమాధానమిచ్చింది.కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, “అతనిలో మెచ్యూరిటీ లేదు. ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలా, ఫస్ట్ లవ్‌లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు” అని వ్యాఖ్యానించింది. అలాగే గౌరవ్ గురించి మాట్లాడుతూ “అతను రాక్షసుడు, ఈగో ఎక్కువ.
గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది” అని తెలిపింది. పవన్ గురించి “నీ గేమ్ నువ్వు ఆడు, ఎమోషనల్ కాకుండా ఫోకస్ పెట్టు” అని సూచించింది. బిగ్ బాంబ్ మాత్రం రీతూకి ఇచ్చి, ఈ వారం మొత్తం బాత్రూమ్‌లను క్లిన్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ఆదివారం ఎపిసోడ్ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది.

సుమన్ శెట్టి డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
నాగార్జున నిర్వహించిన ఫన్ గేమ్స్, సెలబ్రిటీ ఫోటో టాస్క్‌లు హౌజ్‌లో నవ్వులు పూయించాయి. రమ్య మోక్ష, సుమన్ శెట్టి డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అయితే బిగ్ బాస్ (Bigg Boss 9) ద్వారా రమ్యకు భారీగానే రెమ్యునరేషన్ అందిందని సమచారం. ఆమెకు వారానికి సుమారు రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకు గానూ రమ్య మోక్ష దాదాపు రూ.4 లక్షల మేర అందుకున్నట్లు సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: