ఇప్పటివరకూ 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సరికొత్త హంగులతో ఆదివారం (సెప్టెంబర్ 7వ తేదీ) ఆరంభమైంది. అనేకులను ఆకట్టుకుంటున్న ఈ బిగ్ బాస్ (Bigg Boss) మళ్లీ అందరినీ అలరించేందుకుముందుకు వచ్చింది. ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాక అందులో నటించేవారికి మంచి పేరుతో పాటు ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఇందులో ఉత్సాహాన్ని రేక్కేత్తించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని వ్యాఖ్యాతగా ఉన్న నాగార్జున చెప్పారు. అంతేకాదండోయ్ ఈ సారి ఈ సీజన్లో ప్రముఖులతోపాటు, సామాన్యులకు సమాన అవకాశాలు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఫైనల్ కు చేరుకున్న 13మంది
బిగ్ బాస్ లో నటించేందుకు పెట్టిన అన్ని టెస్టులను దాటుకుని 13మంది ఫైనల్ కు చేరుకున్నారు. వీరి నుంచి ఆరుగురిని ఎంపిక చేసి, హౌస్ లోకి పంపారు. సెలబ్రిటీల నుంచి 9మంది ఈ సీజన్ లో అడుగు పెట్టారు. మొత్తం బిగ్ బాస్ సీజన్-9 (Bigg Boss Season 9) లో 15 మంది కంటెస్టెంట్లు అయ్యారు. ఈ సారి బిగ్ బాస్ ను రెండు ఇళ్లుగా డిజైన్ చేశారు. మెయిన్ హౌస్ లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక హౌస్ లో ఏమీ ఉండవు. అగ్నిపరీక్షలో తమ సత్తా చాటిన సామూన్యులు మెయిన్ హౌస్ లో ఉంటారని, సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో హౌస్ లో ఉండాలని వ్యాక్యత నాగార్జన సూచించారు.
తొలి కంటెస్టెంట్ గా తనూజ పుట్టస్వామి

బిగ్ బాస్ సీజన్ -9లో తొలి కంటెస్టెంట్గా బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి అడుగు పెట్టారు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియదని, వాళ్లు సంతోషించేలా నడచుకుంటానని హామీ ఇచ్చారు.
రెండో కంటెస్టెంట్ గా నటి ఫ్లోరా షైనీ (ఆశాషైనీ)

బిగ్ బాస్ సీజన్లో రెండో కంటెస్టెంట్ గా నటి ఫ్లోరా షైనీ (ఆశాషైనీ) అడుగు పెట్టారు. ‘నరసింహ నాయుడు’, ‘నువ్వ నాకు నచ్చావ్’ వంటి,చిత్రాలలో నటించారు. కెరీర్ తొలిదినాల్లో తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయని, ఆ తర్వాత తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. బిగ్
బాస్ వేదికతో మరోసారి తన సత్తాను చాటుతానని చెప్పారు.
సామాన్యుల నుంచి బిగ్ బాస్ కి వెళ్లిన కళ్యాణ్ పడాల

బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యుల నుంచి కళ్యాణ్ పడాల హౌస్ లోకి అడుగుపెట్టారు బిగ్బస్ టీమ్ నిర్వహించిన అగ్ని పరీక్ష దాటుకుని,ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కళ్యాణ్కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో అతడు హౌస్ లోకి అడుగు పెట్టిన మూడో కంటెస్టెంట్ అయినట్లుగా
నాగార్జున ప్రకటించారు.
సెలబ్రిటీల నుంచి ఇమ్మాన్యుయేల్ ఎంపిక

నాలుగో కంటెస్టెంట్గా సెలబ్రిటీల నుంచి ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. జబర్దస్త్ షో సహా పలు సినిమాల ద్వారా ఇమ్మాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వించారు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులకు సైతం వినోదాన్ని
పంచుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
శ్రష్టి వర్మ

కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. తనకు సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్ తో ఉంటారని,’బిగ్ బాస్’ వంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒకట్రెండు వారాలు నటించడం సులభమే కానీ, ఆ తర్వాత కుదరదని తెలిపారు. తనకు ఎలాంటి ఫిల్టర్స్ లేవని శ్రష్టి తెలిపారు.
జ్యూరీ మెంబర్స్ ను మెప్పించిన హరిత్ హరీశ్

అగ్నిపరీక్షలో భాగంగా జ్యూరీ మెంబరున్ను మెపించిన హరిత హరిశ్ అలియాస్ మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టారు. జ్యూరీమెంబర్ అయిన బిందుమాధవి ఆయన పేరును ప్రకటించారు. తనచిరకాల స్వప్నం నెరవేరిందని హౌస్ లోకి వెళ్లే భాగ్యం దక్కిందని హరీశ్
చెప్పారు. ఒత్తిడిలో ఉన్న తనకు ‘బిగ్ బాస్’ గొప్ప ఊరట నిచ్చినట్లు చెప్పారు. అంతేకాక సీజన్ లో ఉన్నన్ని రోజులు తాను జుట్టు లేకుండా గుండుతోనే ఉంటానని వాగ్దానం చేశారు.
సీజన్ 9లో ప్రవేశించిన బుల్లితెర నటుడు భరణి

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై అలరించిన భరణి కూడా సీజన్ 9కు వచ్చారు. అయితే, తనతో ఓవస్తువు తీసుకొచ్చారు. అదేంటో చూపించాలని బిగ్ బాస్ కోరడంతో అందుకు భరణి నిరాకరించారు. దానిని హౌస్ లోకి తీసుకెళ్లానని చెప్పారు. వస్తువులేవీ హౌస్ లోకి తీసుకెళ్లడం కుదరదని చెప్పడంతో అందుకు భరణి కూడా అంగీకరించలేదు. ఆ వస్వుఉ ఏంటో చెప్పిన తర్వాతహౌస్లోకి వెళ్లాలని లేకపోతే ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పడంతో భరణి హౌస్ లోకి అడుగు పెట్టకుంటానే బిగ్ బాస్ సీజన్9 నుంచి వెళ్లిపోయారు.
బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన యాంకర్ రీతూ చౌదరి

ఈమె అసలు పేరు దివ్య. తర్వాత ఆమె పేరు మార్చుకున్నారు. బుల్లితెర నటిగా, యాంకర్ గా తనదైన ముద్ర వేసుకున్ను రీతూ చౌదరి బిగ్ బాస్ లోను అలరిస్తానని అంటున్నారు.
జపనీస్ నవలలు చదివే సామాన్యుడు పవన్

బిగ్ బాస్ లోకి మూడో సామాన్యుడిగా డిమోన్ పవన్ హౌస్ లోకి ప్రవేశించారు. తాను జపనీస్ నవలలు బాగా చదువుతానని పవన్ చెప్పారు. తాను ఆలోచించి మాట్లాడాతనని
అందరూ అంటారని చెప్పారు.
కష్టపడి పైకొచ్చిన అమ్మాయి నటి సంజన

పలు చిత్రాల్లో నట్టించిన నటి సంజన గల్రానీ బిగ్ బాస్ సీజన్ 9లోకి ప్రవేశించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే తనకు ముఖ్యమని అన్నారు. ఈ అందరిలో ఉంటే
సగటు అమ్మాయిని నేను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్త డాక్టర్ అని సంజన తన గురించి చెప్పుకున్నారు.
51కోట్లకు పైగా వ్యూస్ ఉన్న గాయకుడు రాము రాథోడ్

‘రాను బొంబయికి రాను’ అంటూ సోషల్ మీడియాను ఊపేసిన గాయకుడు రాము రాథోడ్. యూట్యూబ్ వేదికగా (51 కోట్లకు పైగా వ్యూస్) పాటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫంక్షన్స్, తీన్మార్ ఇలా ఏ ఊరేగింపు అయినా ఈ పాట లేకుండా అడుగు పడదు. అలాంటి ఫోక్ సాంగ్ తో అలరించిన రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లోకివెళ్లాడు. మనం కూడా సొంతంగా ఒక పాట క్రియేట్ చేసి డ్యాన్స్ చేయాలన్న ఆలోచన నుంచి వచ్చినవే నా పాటలు అంటూ రాము రాథోడ్ పేర్కొన్నారు.
సామాన్యుల కేటగిరి నుంచి శ్రీజ

బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుల కేటగిరి నుంచి శ్రీజ దమ్ము అడుగుపెట్టారు. నేనెప్పుడూ విజేత స్థానానికే లక్ష్యం పెట్టుకున్నా. కచ్చితంగా విజేతనవుతా. ప్రేక్షకులు అభిమనించి,
ఆదరించినందు ధన్యవాదాలు అన్నారు.
హాస్య నటుడు సుమన్ శెట్టి

సెలబ్రిటీ కేటగిరి నుంచి హాస్య నటుడు సుమన్ శెట్టి బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టారు. ‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆయన ‘7/జీ బృందావనకాలనీ’ స
హా పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ‘తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి సినిమాలు చేస్తున్నారు. ఈ సీజన్ లో నిజాయితీగా ఆడి, మీ చేతులమీదుగా బిగ్ బాస్ కప తీసుకుందామనుకుంటున్నా’ అంటూ నవ్వులు పూయించారు.
సామాన్యుల కేటగిరిలో ఎంపికైన ప్రియశెట్టి

బిగ్ బాస్ లో సామాన్యుల కేటగిరి నుంచి ఆడియెన్స్ ఓట్ల ద్వారా ప్రియశెట్టి హౌస్ లోకి అడుగు పెట్టారు. బిగ్ బాస్ పై నాకున్న ఆసక్తిని బట్టి మా అమ్మానాన్న ప్రోత్సహించారు. పెళ్లి
సంబంధాలు చూస్తున్నా, వాటిని ఆపేసి బిగ్ బాస్ కు పంపారు అందుకే ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
మనిష్ మర్యాద

నటుడు అభిజీత్ విన్నపం మేరకు సామూన్యుల నుంచి మనిష్ మర్యాదను బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ‘అగ్ని పరీక్షలో మొదటి మూడు ఎపిసోడ్స్ స్ట్రాటజీ అనుకుంటూ ఆడా అని మనీష్ చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: