బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ షో (Big Boss) తెలుగులో ఇప్పటికే 8 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 9 రన్ అవుతుంది. ఈ సీజన్ సైతం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అయితే బిగ్‌బాస్ (Big Boss) షో ఛాన్స్ కోసం సెలబ్రెటీలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారో చెప్పక్కర్లేదు. మరోవైపు ఈ షోపై ఎన్నో విమర్శలు వస్తుంటాయి.
Read Also: Bigg Boss 9: ఇమ్మూని ఇరికించిన ఆడియన్స్
ఆమె ఆవేదన వ్యక్తం చేశారు
తాజాగా, బిగ్‌బాస్‌పై ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) సంచలన ఆరోపణలు చేశారు. ఆ షోలో పాల్గొనడం వల్ల తనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, తన సినీ కెరీర్‌కు తీవ్ర ఆటంకం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఆమె మాట్లాడుతూ, ‘‘నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది.

అక్కడ సంపాదించిన దానికన్నా రెండింతలు నష్టపోయాను. ఆ షో అగ్రిమెంట్ కారణంగా నాకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాలు లేవు, అవకాశాలు లేవు. షోకు వెళ్తే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు, కానీ బయటకు వచ్చాక నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇది నన్ను చాలా బాధపెట్టింది. బిగ్‌బాస్ షో వల్లే నేను ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సి వచ్చింది’’ అని (Karate Kalyani) తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: