స్టార్ మా చానల్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) మొదటి రోజునుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో మూడు వారాలకే చేరుకుని ఇప్పటికే సంచలనాలను సృష్టిస్తోంది. సెలబ్రిటీలు, కామనర్లు కలిసి హౌస్‌లోకి అడుగు పెట్టడం వల్ల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ సీజన్‌లో మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు పాల్గొంటున్నారు. ప్రారంభం నుంచే ఈ కాంబినేషన్ హౌస్‌లో విభిన్న వాతావరణాన్ని తీసుకొచ్చింది. గేమ్ టాస్కులు, డిస్కషన్లు, వాదోపవాదాలు అన్నీ రియాలిటీ షో (Reality show) లో కొత్త రంగులు నింపుతున్నాయి.
ఎలిమినేషన్లు ప్రారంభం
మూడో వారానికి చేరుకునేలోపు ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. సెలబ్రిటీల విభాగం నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల విభాగం నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. వీరి ఎలిమినేషన్లతో మిగతా హౌస్‌మేట్స్ (Housemates) లో టెన్షన్ పెరిగింది.అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు.
టెనెంట్లు.. ఐదుగుర్ని నామినేట్ చేయాలని, అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయుండాలని కండిషన్ పెట్టాడు. దీంతో హరీశ్, ప్రియ, శ్రీజ సంజనాను నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్, ఫ్లోరాను నామినేట్ చేశారు. చివరకు టెనెంట్స్‌లో ఒకర్ని అనగానే అందరూ కలిసి హరీశ్‌ను నామినేషన్స్‌లో నిలబెట్టారు.
ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు
మొత్తానికి మూడో వారం నామినేషన్స్ హౌస్ లో ఒక చిన్న పాటి యుద్ధాన్నే తలపించాయి. శ్రీజ, హరిత హరీష్, ప్రియాశెట్టి, సంజన, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయేల్, భరణి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
రాము రాథోడ్, రీతూ చౌదరీ, ప్రియా, హరిత హరీష్, కల్యాణ్, ఫ్లోరా షైనీ నామినేషన్స్ లో నిలిచిన వారిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ట్విస్టులపై ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్. మరి మంగళవారం ఏమైనా ట్విస్టులు ఇస్తాడేమో చూడాలి. అలా జరిగితే నామినేషన్స్ లిస్టు మళ్లీ మారిపోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: