కన్నడ బిగ్‌బాస్ (Bigg Boss) షోకు ఎదురైన పెద్ద అడ్డంకి ఇప్పుడు తొలగిపోయింది. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు షో కోసం ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ హౌస్‌పై సీల్ వేసి షో నిర్వహణను నిలిపివేయగా, ఇది ,అభిమానులకు, షో నిర్వాహకులకు ఇబ్బందిని కలిగించింది. ఈ ఘటన తరువాత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar) జోక్యంతో, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించి హౌస్‌ను తిరిగి తెరిచారు.
Vijay: కరూర్ తొక్కిసలాట.. విజయ్ కు శివరాజ్ కుమార్ కీలక సూచన
బిగ్‌బాస్ షో చిత్రీకరణ జరుగుతున్న బిడదిలోని ‘జాలీవుడ్’ స్టూడియో నుంచి ప్రతిరోజూ దాదాపు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీటిని బయటకు వదులుతున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో నిర్వాహకులకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు.
అయితే, ఆ నోటీసులను నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో, తహసీల్దారు తేజస్విని నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం బిగ్‌బాస్ హౌస్(Bigg Boss)కు బయటి నుంచి తాళాలు వేసి సీల్ చేసింది.ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner of Bangalore South District) కు ఆదేశాలు జారీ చేశారు.

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండటంతో
పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండటంతో పాటు, కన్నడ వినోద పరిశ్రమకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్’ (X) వేదికగా తెలిపారు. డీసీఎం ఆదేశాలతో అధికారులు వెంటనే బిగ్‌బాస్ హౌస్‌కు వేసిన సీల్‌ను తొలగించారు.
ఈ పరిణామంపై షో వ్యాఖ్యాత కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు, సహకరించిన అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటి వరకు బిగ్‌బాస్ షో అందించిన ఎంటర్‌టైన్‌మెంట్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు, హౌస్ సీల్ తీసివేయడం వల్ల షో నేరుగా ముందుకు సాగుతుందని, ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: