బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9 ఎపిసోడ్‌లు ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పాత కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ మూడ్ పెంచేశారు. ఈ వారం ఎలిమినేషన్స్‌లో మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు.
Read Also:Hollywood: బ్రేకప్ చెప్పుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్
ఈ సీజన్ ఘర్షణలు, టాస్క్‌లు, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటోంది. కొత్త కంటెస్టెంట్లు రావడంతో రచ్చ డబుల్ అయ్యింది. గత వారం ఇద్దరు హౌస్ నుండి బయలుదేరగా, ఇప్పుడు ఎవరు బయటకు వెళ్లబోతున్నారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
తాజా ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌లో(Bigg Boss) ఉన్నవారికి ఓ క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా మాధురి, కళ్యాణ్ మధ్య జరిగిన గొడవపై స్పష్టత తీసుకువచ్చారు. సుమన్ శెట్టిని అడిగినప్పుడు ఆయన మాధురి తప్పు చేశారని చెప్పడంతో, వీడియో క్లిప్ చూపించి ఆడియన్స్ ఓటింగ్‌లో 60మంది మాధురి తప్పు అని నిర్ణయించారు. దీంతో ఆమె పవర్ స్టోన్‌ను నాగ్ తీసేశారు.
ఇక అయేషా దగ్గర ఉన్న పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్‌పై కూడా నాగ్ ప్రశ్నించారు. ఆమె తనుజను డిజర్వ్ అని చెప్పగా, నాగ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. రీతూ, నిఖిల్, ఇమ్మాన్యుయేల్, భరణి వంటి ఇతర కంటెస్టెంట్లను కూడా నాగార్జున ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నిస్తూ క్లాస్ ఇచ్చారు. ఇక ఈ వారం రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఓటింగ్ ట్రెండ్ చూపిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: