బిగ్ బాస్ 9 సీజన్ (Bigg Boss 9) మొదలైన దగ్గర నుంచి ఒక్క రోజైనా బోర్ కొట్టే పరిస్థితి రాలేదు. ప్రతి ఎపిసోడ్ కొత్త ట్విస్టులు, భావోద్వేగాలు, గొడవలు, స్నేహాలు, రహస్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ తమ సత్తా చాటుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇకపోతే, గత వారం జరిగిన ఎలిమినేషన్ షాక్‌కు గురిచేసింది. ప్రేక్షకులు ఊహించని విధంగా మాధురి హౌస్ నుండి బయటకు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
Read Also: Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం హడావిడి!
సాధారణంగా బిగ్ బాస్ (Bigg Boss 9) లో ఎవరు బయటకు వెళ్తారో చివరి వరకు ఊహించడం కష్టం. చాలా మంది అభిమానులు మాధురి ఓట్లలో వెనుకబడ్డదని భావించగా, ఆమె మాత్రం “నేనే కావాలనే బయటకు వచ్చేశాను అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social media) లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే ఈసారి హౌస్ నుంచి బయటకు వచ్చేది అతనే అని ఇన్ సైడ్ టాక్..

బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్, సాయి శ్రీనివాస్, అయేషా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. వీరిలో ఇప్పటికే అయేషా, రమ్య మోక్ష, మాధురి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు సాయి శ్రీనివాస్ (Sai Srinivas) హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు కనిపించనున్నాయి.
ఓటింగ్ లో సాయి శ్రీనివాస్ వెనకబడి ఉన్నాడు
ఇప్పటికే ఓటింగ్ లో సాయి శ్రీనివాస్ వెనకబడి ఉన్నాడు. మనోడు హౌస్ లో కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడంలేదు.. టాస్క్ ల విషయంలోనూ సాయి ఎక్కడగా కనిపించడం లేదు. దాంతో ఈసారి నామినేషన్స్ లో ఉన్న సాయి.
ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓట్లు కూడా అతనికి తక్కువ వస్తున్నాయి. రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నారు. ఓటింగ్ కు ఇంకా రెండు రోజులు ఉండటంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: