బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) లో హౌస్ మొత్తం హంగామా ఆపడం లేదు. నాలుగో రోజు కాస్త ఎక్కువగానే రచ్చ సాగింది. ఈసారి ప్రత్యేకంగా కామనర్స్, సెలబ్రెటీలు అనే విభజన చేసారు. సాధారణంగా ప్రతి సీజన్‌లో సెలబ్రెటీలు ఎక్కువగా హైలైట్ అవుతుంటారు. కానీ ఈ సారి మాత్రం దానికి విరుద్ధంగా సామాన్యులు మోజు చూపిస్తున్నారు. వీరు హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే గేమ్ మోడ్‌లోకి వెళ్ళారు.
ఇక బిగ్ బాస్ ఈ సారి కొత్త కాన్సెప్ట్‌తో వస్తూ సామాన్యులను హౌస్ ఓనర్లుగా, సెలబ్రెటీలు టెనెంట్స్‌గా చూపించాడు. దాంతో గేమ్‌లోనే కాకుండా, బంధాలు, మాటల తీరులో కూడా తేడా కనపడుతోంది. సాధారణంగా అభిమానులు కామనర్స్ (Commoners) పట్ల ఎక్కువ సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో వాళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రవర్తన వేరే లెవెల్‌లోకి తీసుకెళ్ళాయి.
వీరిలో ఒకరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు
కాగా మరో రెండు రోజుల్లో ఈవారం పూర్తి కానుంది. దాంతో హౌస్ నుంచి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మొదటి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంది. కాగా ఈ వారం నామినేట్ అయిన వారికి ఓటింగ్స్ మాత్రం ఊహించని విధంగా వస్తున్నాయి.ఈ వారం నామినేషన్స్ (Nominations) లో ఉన్నది శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్.

వీరిలో ఒకరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్లనున్నారు. అయితే అందరూ సుమన్ శెట్టి (Suman Shetty) హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నారు. ఆయన మొదటి రోజు నుంచి చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దాంతో ఆయనే ఈసారి ఎలిమినేట్ అయ్యేది అని అంతా భావించారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది.
ఓటింగ్ లో సుమన్ శెట్టి టాప్
ఊహించని విధంగా సుమన్ శెట్టికి ప్రేక్షకులనుంచి మద్దతు వస్తుంది. ఓటింగ్ లో ఆయన టాప్ ఉన్నారు. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లారు. అలాగే సీరియల్ బ్యూటీ తనూజా గౌడ (Tanuja Gowda) కూడా ఓటింగ్ లో టాప్ ఉంది. అలాగే ఇమ్మానుయేల్ కూడా ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు.
మనోడికి కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నాడు ఆడియన్స్. డిమాన్ పవన్, సంజన, రాము రాథోడ్ కు కూడా ఓకే ఓటింగ్ పర్లేదు ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. అయితే ఊహించని విధంగా రీతూ చౌదరికి తక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆమె కంటే ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మకు తక్కువ ఓట్లు పడుతున్నాయి. చూడబోతే ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మ ఇద్దరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేలా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: