BB9 finalists list : తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ సాగుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ఇప్పుడు తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుండగా, ఈ సీజన్‌కు సంబంధించిన టాప్-5 ఫైనలిస్టులు అధికారికంగా ఖరారయ్యారు. టైటిల్ కోసం తనూజ, డిమోన్ పవన్, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీలు పోటీపడనున్నారు.
తాజాగా జరిగిన వారాంతపు ఎపిసోడ్‌లలో డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో సుమన్‌శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం భరణి హౌస్‌ను వీడారు. దీంతో మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
Read also: Messi fans disappointment : కోల్కతాలో మెస్సీ ఇవెంట్ గందరగోళం వేలాది అభిమానులకు నిరాశ
ఈ విషయాన్ని షో హోస్ట్ అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్లను (BB9 finalists list) సేవ్ చేయడానికి ఓటింగ్ చేయగా, ఇక నుంచి టైటిల్ విజేతను నిర్ణయించే కీలక ఓటింగ్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీంతో బిగ్‌బాస్ 9 టైటిల్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఈ ఐదుగురిలో ఎవరు బిగ్‌బాస్ 9 విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలంటే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: