हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9 – సంజనను కెప్టెన్‌గా ప్రకటించిన శ్రీజ

Anusha
Latest News: Bigg Boss 9 – సంజనను కెప్టెన్‌గా ప్రకటించిన శ్రీజ

బిగ్ బాస్ (Bigg Boss 9) తెలుగు సీజన్‌ తాజా ఎపిసోడ్ ఐదో రోజుతో మరింత ఆసక్తికరంగా సాగింది. ఇప్పటివరకు జరిగిన టాస్కులు, వాదోపవాదాలు, స్నేహాలు, విభేదాలతో హౌజ్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ ప్రత్యేకత ఏమిటంటే హౌజ్‌కి తొలి కెప్టెన్ ఎంపిక కావడం.కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ప్రత్యేక టాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో ప్రతి ఒక్కరు తమ శక్తి, వ్యూహాలతో పోటీ పడ్డారు.

చివరి దశకు చేరుకున్నప్పుడు శ్రీజ (Sreeja) గేమ్‌లో నిలదొక్కుకొని గెలుపొందింది. కానీ శ్రీజ కెప్టెన్‌గా కాకుండా, తన విజయంలో ప్రధాన పాత్ర పోషించిన సంజన (Sanjana) కు ఈ అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో సంజన బిగ్ బాస్ హౌజ్‌లో తొలి కెప్టెన్‌గా ఎంపికై, వారం రోజుల పాటు లగ్జరీ సౌకర్యాలను పొందే ప్రత్యేక హక్కు సంపాదించింది.సంజన కెప్టెన్‌ కావడంతో హౌజ్‌లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఆమె తన కెప్టెన్ రూమ్‌లో ఉండేందుకు శ్రీజ, మనీష్‌లను ఎంచుకోవడం ఇతర సభ్యుల దృష్టిని ఆకర్షించింది.

వర్గాలుగా విడిపోవడం కూడా గమనార్హం

ఈ నిర్ణయం కొంతమందికి నచ్చగా, మరికొందరికి అసంతృప్తి కలిగింది. హౌజ్‌ (House) లో ఉన్న వారు క్రమంగా వర్గాలుగా విడిపోవడం కూడా గమనార్హం. ఇమ్మాన్యుయెల్‌, భరణి ఒక గ్రూప్‌గా కనిపిస్తుండగా, హరీష్‌, ప్రియా, మనీష్ మరో గ్రూప్‌గా కలుస్తున్నారు. అదే సమయంలో రీతూ, పవన్ కళ్యాణ్‌, పవన్ వేరే వర్గంగా ప్రవర్తించడం హౌజ్‌లో కొత్త సమీకరణాలకు దారితీసింది.ఇక సంజన కెప్టెన్‌గా ఎంపిక కావడం ఆమె గేమ్‌కి బలం చేకూరుస్తుందని అనుకోవచ్చు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో సభ్యులను సమన్వయం చేయడం, పనులను పంచిపెట్టడం, హౌజ్‌లో క్రమశిక్షణ పాటించేలా చూడడం వంటి బాధ్యతలు ఆమెపై ఉన్నాయి.

ఈ అవకాశం ద్వారా ఆమె తన నాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశం దక్కించుకుంది.మరోవైపు సంజనా–తనూజ క్లోజ్‌గా మాట్లాడుకున్నారు. ప్రత్యర్థి టీమ్‌ సభ్యురాలు అయిన కూడా ఆమెని కెప్టెన్‌గా చేశారని హరీష్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఇమ్మాన్యుయెల్‌ తనపై వస్తున్న బాడీ షేమింగ్ (Body Shaming) కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేయగా, భరణి ఆయనకు సపోర్ట్‌ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కెప్టెన్‌ సంజనా తనూజకు వంటలో స్పెషల్‌ ఆర్డర్‌ ఇవ్వడం వివాదానికి దారితీసింది.

Bigg Boss 9
Bigg Boss 9

తనూజ ఆగ్రహం వ్యక్తం చేస్తూ

దీనిపై తనూజ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రచ్చ చేసింది. “ఇంటి లోపల ప్రతిరోజూ ఫుడ్‌ కోసం గొడవలు తప్పడంలేదు” అని ఇమ్మాన్యుయెల్‌ (Emmanuel) వ్యాఖ్యానించడం గమనార్హం. కెప్టెన్ అయ్యాక‌ కూల్‌డ్రింక్స్‌ను కంటెస్టెంట్స్‌కి పంచాలనుకున్న సంజనా, “ముందు నన్ను ఇంప్రెస్ చేయాలి” అనే కండిషన్ పెట్టింది. దీనికి హరీష్‌ దొంగతనానికి తెగబడ్డాడు. ఈ సరదా సీన్ తర్వాత, ఇమ్మాన్యుయెల్‌ అడగడంతో హౌజ్‌మేట్స్‌ని జంతువులతో పోల్చింది సంజనా.రీతూ – చిరుత, పవన్ కళ్యాణ్ – బ్లాక్ పాంథర్, భరణి – సింహం, ప్రియా – ఎలుగుబంటి, శ్రష్టి – నక్క, తనూజ – ఉడుత, హరీష్ – హైనా, శ్రీజ – ఎలుక, సుమన్ శెట్టి – తాబేలు, మనీష్ – ఆనకొండ, ఫ్లోరా సైనీ – కోతి, ఇమ్మాన్యుయెల్ – ఏనుగు, తాను – పులి అని పేర్లు పెట్టింది.

ఆ తర్వాత హౌజ్‌లో ఫన్నీ స్కిట్ ప్రదర్శించారు. భార్యాభర్తల మధ్య జ‌రిగే గొడ‌వ‌ల‌ ఆధారంగా రెండు కుటుంబాల మధ్య జరిగే కామెడీని “బతుకు జట్కా బండి” స్టైల్లో నడిపించారు. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ – కూతురు, ప్రియా – తల్లి, సుమన్‌ శెట్టి – కొడుకు, శ్రీజ – అత్త, పవన్ కళ్యాణ్ – భర్త, రీతూ చౌదరీ – చెల్లి, భరణి – లాయర్, తనూజ – యాంకర్‌గా ఆకట్టుకున్నారు. స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించగా, ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది. చివరగా కెప్టెన్‌ సంజనా బాగా పర్ఫామ్ చేసిన వారికి థంబ్స్‌ అప్ బాటిల్స్‌ (Thumbs up bottles) గిఫ్ట్‌లుగా ఇచ్చింది. మొత్తంగా, ఐదో రోజు ఎపిసోడ్‌లో కెప్టెన్సీ రేసు, గ్రూపుల రాజకీయాలు, ఫుడ్‌ ఫైట్స్‌, ఫన్నీ మోమెంట్స్ అన్నీ కలిసి పూర్తి ఎంటర్టైన్మెంట్‌ పంచాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/bb-season-9-what-did-harish-say-about-the-uproar-in-bigg-boss/cinema/bigg-boss/546056/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870