బిగ్‌బాస్ ((Bigg Boss 9)) ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో తనూజ గౌడ తరఫున స్టేజ్ మీదకి ఆమె బెస్ట్ ఫ్రెండ్ పవన్ సాయి, అలానే నటి హరిత వచ్చారు. వీరు ముగ్గురూ కలిసి ముద్ద మందారం సీరియల్‌లో కలిసి నటించారు. హరితని కూడా తన సొంత తల్లిలానే తనూజ ట్రీట్ చేస్తుంది.
Read Also: Bigg Boss 9: ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఆమేనా?
ఈ హౌస్‌లో ఏమైనా తప్పు చేసిఉంటే
దీంతో తనూజ తల్లి సావిత్రి.. ఆమె చిన్న కూతురు పూజ పెళ్లిలో బిజీగా ఉండటంతో హరిత వచ్చిందన్నమాట. మరి ఈ ఇద్దరూ తనూజకి ఏం చెప్పారు..? మనీష్‌కి ఇచ్చిన కౌంటర్ ఏంటో చూద్దాం.తనూజ కోసం హరిత-పవన్ సాయి.. స్టేజ్ మీదకి రాగానే తనూజ కన్నీళ్లతో గార్డెన్ ఏరియాని తడిపేసింది.

దీంతో తనూజ ఏడవనని మాటిచ్చావ్ అమ్మని చూడంగానే ఏడుస్తున్నావ్.. ఇంతకీ ఎవరిని చూసి ఏడుస్తున్నావ్.. అని నాగార్జున అడిగారు. ఇద్దరినీ.. అని చెప్పి.. టైట్ హగ్ మీకు.. నేను చాలా మిస్ అయ్యా.. అమ్మా.. ఫస్ట్‌లీ మీకు 3 సారీలు చెప్పాలి.. ఫస్ట్ సారీ తెలియకుండా ఈ హౌస్‌లో ఏమైనా తప్పు చేసి మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే..
సెకండ్ సారీ ఎమోషనల్ అవ్వని చెప్పా కానీ బయట కంపేర్ చేస్తే ఇక్కడ అంత ఎమోషనల్ అవ్వట్లేదు.. థర్డ్ సారీ మిమ్మల్ని మిస్ అవ్వనని చెప్పా.. అండ్ మీరు కప్పుతోనే రావాలన్నారు.. అది ఎక్కడి వరకూ రీచ్ అవుతానో తెలీదు అందుకే ముందే సారీ చెప్తున్నా.. అంటూ తనూజ పెద్ద డైలాగ్‌యే కొట్టింది.
ఇక తనూజ చెల్లి పెళ్లి గురించి కూడా హరిత మాట్లాడింది. బంగారం.. నీ చెల్లి పెళ్లి అంతా సూపర్‌గా జరుగుతుంది.. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.. ముఖ్యంగా మిస్టర్ పుట్టస్వామి చాలా హ్యాపీ.. ఆయన నిన్ను కప్పుతోటి చూడాలని కోరుకుంటున్నారు.. మనల్ని అనేవాళ్లు ఉన్నారంటే మనం ఎక్కడో ఉన్నట్లే కదా.. పళ్లు ఉన్న చెట్టుకే రాళ్లు.. అంటూ హరిత డైలాగులు కొట్టింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: