బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. హౌస్ మేట్స్ కు తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దాంతో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఫ్యామిలీలు వచ్చాయి. ముందుకు సుమన్ శెట్టి భార్య ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి (Suman Shetty) భార్య లాస్య హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సుమన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Read Also: Bigg Boss 9: 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు
భార్యను చూసిన ఆనందంలో ఎమోషనల్ అయ్యారు. భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే కొడుకు, కూతురి గురించి అడిగి తెలుసుకున్నారు సుమన్. భార్యతో మాట్లాడుతున్నంత సేపూ ఆయన ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. అది చూసి పేక్షకులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
అలాగే లాస్య ఆయనను నిజాయితీగా ఆడుతున్నావంటూ ప్రశంసించింది. కానీ ఒక ముఖ్యమైన సలహా కూడా ఇచ్చింది. తనూజకి కొంచెం దూరంగా ఉండాలి, ఆమెతో ఉంటే హైప్ ఆమెకే వెళుతుందని, గేమ్‌లో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించిన విషయం చర్చనీయాంశమైంది.

తనూజ పై ఇప్పటికే చాలా ట్రోల్స్
దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ దత్త పుత్రిక తనూజ (Tanuja) పై ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. బిగ్ బాస్ ఆమెను కావాలనే సేవ్ చేస్తున్నారని, ఎక్కువ స్క్రీన్ ఆమెకే ఎక్కువ ఇస్తున్నాడు.
ఇక ఇప్పుడు సుమన్ శెట్టి (Suman Shetty) కి భార్య ఇచ్చిన సలహా పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా వదిన మాట విను.. ఖచ్చితంగా కప్పు కొడతావ్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: