బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు చేరువ అయ్యింది. మరికొన్ని రోజుల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గ్రాండ్ ఫినాలే వీక్ కావంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతున్నారు. కాగా ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
Read Also: Big Boss: బిగ్‌బాస్ వల్ల నష్టపోయా: కరాటే కల్యాణి
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో డీమాన్ పవన్‌కి కూడా గట్టి షాక్ తగిలింది. లీడర్ బోర్డులో అందరికంటే తక్కువ స్కోర్ ఉన్న కారణంగా ఈ పోరు నుంచి డీమాన్ పవన్ మీరు తప్పుకోవాల్సి ఉంటుంది.. ఇప్పటివరకూ ఈ పోరులో మీరు సంపాదించిన స్కోరులో సగం ఇంటిసభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది.. అని బిగ్‌బాస్ (Bigg Boss 9) చెప్పాడు. దీంతో తన తర్వాత లీస్ట్‌లో ఉన్న తనూజకి డీమాన్ హెల్ప్ చేశాడు.
నా పాయింట్లు తనూజకి ఇస్తున్నా అని డీమాన్ చెప్పాడు.ఈ దెబ్బతో నాలుగవ స్థానంలో ఉన్న తనూజ (295) పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌కి వెళ్లిపోయింది. తర్వాత సంజన (90), ఇమ్మానుయేల్ (270), భరణి (230)తో వరసుగా ఉన్నారు. ఇక ఇంటి సభ్యులందరూ కలిసి నేను ఇచ్చే తర్వాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుడ్ని ఎన్నుకోవాలి.. ప్రేక్షకుల్ని కలుసుకోవడానికి మీరు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి కూడా ఇదే చివరి అవకాశం.. అని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.

ప్రతిసారి ఇటు నుంచే కదా వెళ్తున్నాం
దీంతో తనని ఎక్కడ లేపేస్తారోనని భరణి.. తనూజ దగ్గరికి మాట్లాడటానికి వెళ్లాడు. నువ్వేమనుకుంటున్నావ్.. అని భరణి అడిగితే నేను ఇమ్మానుయేల్‌ని తప్పించాలని అనుకోవడం లేదు.. అంటూ తనూజ ఓపెన్‌గా చెప్పేసింది. నా వరకూ అయితే ఒకటి మీరు, రెండు సంజన గారు.. అని తనూజ చెప్పింది. ఈ మాటకి భరణి అవాక్కయ్యాడు. నా కన్నా వై ఇమ్మానుయేల్ ప్రయారిటీ అంటున్నా.. అని భరణి అడిగాడు.ఈ మధ్య కాలంలో నాకు స్టాండ్ తీసుకుంది వాడే కదా.. అంటూ తనూజ చెప్పింది.
దీంతో భరణి సైలెంట్‌గా సంజన, సుమన్ శెట్టి దగ్గరికెళ్లిపోయాడు. నాకు హెల్ప్ చేస్తుందా చేయదా అన్నది పక్కన పెట్టు కానీ ఇమ్మానుయేల్ నా గురించి స్టాండ్ తీసున్నాడని చెప్పిన మాట నాకు చాలా బాధేస్తుంది.. మరి నేనేం చేశాను.. అంటూ భరణి చెప్పుకున్నాడు.కాసేపటికి తర్వాత జరిగే యుద్ధం కోసం ఎవర్ని తొలగిస్తున్నారు.. అని బిగ్‌బాస్ అడిగాడు.
వెంటనే కళ్యాణ్ ఈసారి అటు నుంచి స్టార్ట్ చేద్దాం.. అని భరణి అన్నాడు. ఇది మరీ బావుంది.. అని కళ్యాణ్ అనగానే ప్రతిసారి ఇటు నుంచే కదా వెళ్తున్నాం.. అటు నుంచి చేయండి.. అని భరణి అన్నాడు. దీంతో కళ్యాణ్ పక్కనే ఉన్న తనూజ లేచి సరే స్టార్ట్ చేయండి.. అంటూ వెనక్కి వెళ్లిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: