हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Bigg Boss 9- బిగ్‌బాస్‌ 9 మొదటి వారం..శ్రష్టి వర్మ ఔట్

Anusha
Bigg Boss 9- బిగ్‌బాస్‌ 9 మొదటి వారం..శ్రష్టి వర్మ ఔట్

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 (Bigg Boss Telugu Season 9) మొదటి వారం ముగిసింది. నాగార్జున హోస్ట్‌గా ఈ సీజన్‌ను మరింత గ్రాండ్‌గా ప్రారంభించారు. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌తో వారం పూర్తవగా, ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన తొలి ఎలిమినేషన్‌ ఎపిసోడ్ కూడా వచ్చింది.ఈ వారం హౌస్‌లో ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇప్పటికే తెలుసుకున్న ప్రేక్షకులు, ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఊహించుకుంటూ ఉన్నారు.

సోషల్ మీడియాలో, ఫ్యాన్‌పేజీల్లో కూడా ఎలిమినేషన్‌పై విభిన్న చర్చలు జరిగాయి. చాలామంది అంచనాల ప్రకారం ఒక లేడీ కంటెస్టెంట్‌ బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని భావించారు. అయితే చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయి, కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ (Choreographer Srashti Varma) హౌస్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

ప్రేక్షకులను ఆకట్టుకోవాలని

శ్రష్టి వర్మకి ఇది బిగ్‌బాస్‌ హౌస్‌లో తొలి అనుభవం. ఆమె తనకున్న ఎనర్జీ, చురుకుదనం, డ్యాన్స్‌ స్కిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. మొదటి వారం టాస్క్‌లలోనూ యాక్టివ్‌గా పాల్గొంది. అయినప్పటికీ ఓటింగ్‌లో తగినంత సపోర్ట్‌ రాకపోవడంతో ఆమె ఎలిమినేట్‌ అయ్యారు. ఈ పరిణామం బిగ్‌బాస్‌ హౌస్‌ లోపల ఉన్న కంటెస్టెంట్లను మాత్రమే కాదు, ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది.

నిజానికి మొదటి వారం ఎలిమినేషన్‌లో శ్రష్టి కాకుండా మరో కంటెస్టెంట్‌ బయటకు వెళ్తారని అందరూ భావించారు. సోషల్ మీడియాలో వచ్చిన పోల్స్‌ ప్రకారం కూడా శ్రష్టి సేఫ్‌ జోన్‌లోనే ఉన్నట్టు కనిపించింది. కానీ చివర్లో రిజల్ట్‌ పూర్తిగా రివర్స్‌ అయి, ఆమెనే తొలి ఎలిమినేటర్‌గా ప్రకటించడం షాకింగ్‌గా మారింది.

ఒకట్రెండు వారాలు నటించడం సులభమే

హౌస్‌లోకి వచ్చినప్పుడు శ్రష్టి “నా గురించి నిజమైన వ్యక్తిత్వాన్ని అందరికీ చూపిస్తా” అని చెప్పింది. కానీ మొదటి వారం తక్కువ సమయంలోనే హౌస్‌ నుంచి బయటకు రావడం ఆమెకూ అభిమానులకూ నిరాశ కలిగించింది. అయినా కూడా ఈ షో ద్వారా శ్రష్టికి మంచి పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెను సపోర్ట్‌ చేస్తున్న అభిమానులు సోషల్ మీడియా (Social media) లో పాజిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్‌ తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని శ్రష్టి బిగ్‌బాస్‌లోకి వెళ్లేటప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఒకట్రెండు వారాలు నటించడం సులభమే కానీ, ఆ తర్వాత కుదరదని కూడా పేర్కొంది. సెలబ్రెటీలతో పాటు ఈసారి సామాన్యులకూ అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్‌ ప్రత్యేకంగా నిలిచింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్‌లో సంజన, తనూజ సేవ్‌ అయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bigg-boss-9-first-weekend-will-shrashti-verma-be-eliminated/cinema/bigg-boss/547008/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870