బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss 9) లో 14వ వారం టాస్క్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతి సీజన్‌తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ అద్భుతమైన ట్విస్ట్‌లు, టర్న్‌లు ఇచ్చి ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్నారు. ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు వరుస టాస్క్‌లు ఇచ్చిన బిగ్ బాస్ (Bigg Boss 9) , ప్రతి టాస్క్‌లో ముందంజలో ఉన్న వారికి టెన్షన్ వాతావరణాన్ని పెంచాడు. మంగళవారం ఇచ్చిన వీల్ బ్యారెల్ టాస్క్‌లో ఇమ్మాన్యుయెల్,డీమాన్ పవన్‌లు అత్యధిక స్కోర్లు సాధించారు.అయితే లీడర్ బోర్డులో టాప్1,2లో ఉన్న ఇమ్మానుయేల్, డీమాన్ పవన్ ఇద్దరికీ బిగ్‌బాస్ ఒక బంపరాఫర్ ఇచ్చాడు.
Read Also: Shriya: శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా
టాప్-2లో ఉన్న మీ ఇద్దరూ ఇప్పుడు హౌస్‌కి వచ్చిన కొంతమంది ఆడియన్స్‌ని కలవబోతున్నారు అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఈ మీటింగ్ జరిగింది. ఇమ్మానుయేల్, డీమాన్, ఇద్దరూ ఓట్లు కోరుకునే సమయంలో, వారి తెలివి, స్పందన, ప్రవర్తనను అంచనా వేయడానికి ఆడియెన్స్, బిగ్ బాస్ పలువురు కఠినమైన ప్రశ్నలు సంధించారు. ఇందులో ఇమ్మాన్యుయెల్ ప్రదర్శన విశేషంగా నిలిచింది.
ఆడియెన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, ఇమ్మాన్యుయెల్‌ను ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించాడు. అప్పుడే ఒక ఆడియన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “విన్నర్ అయితే కప్‌ను మొదట ఎవరికిస్తావు? అమ్మకా, గర్ల్ ఫ్రెండ్‌కా?” అని అడగగా, దీనిపై ఇమ్మాన్యుయెల్ భావోద్వేగంతో స్పందిస్తూ, చిన్నప్పటి నుండి హాస్టల్స్‌లో ఉండటం వల్ల అమ్మతో గడిపిన రోజులు చాలా తక్కువని, ఆమె ఎప్పుడూ తన విజయాన్ని ఆశించిందని తెలిపాడు.

తనూజ ఏమైనా అంటే వెంటనే హర్ట్ అవుతున్నా
అందుకే కప్‌ను ముందుగా అమ్మ చేతిలో పెడతానని చెప్పాడు.ఈ విషయం తన గర్ల్ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటుందని, ఆమె కూడా అదే కోరుకుంటుందని ఇమ్మాన్యుయెల్ చెప్పడంతో, ఆ సమాధానం హౌజ్‌లోను, ప్రేక్షకుల్లోను మంచి ప్రశంసలు అందుకుంది.తర్వాత మీ స్ట్రాటజీలు బాగుంటాయి.అందుకే మీ జుట్టు ఊడిపోతుందా అని అడగ్గా.. ముందు నుంచి నా జుట్టు ఇంతే.. ఇక్కడకు వచ్చాకా మరీ రాలిపోయింది అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చాడు.
తనూజ గురించి అడగ్గా.. హౌస్ లోకి వచ్చిన తర్వాత తనకు తనూజ చాలా క్లోజ్ అయ్యిందని.. అందుకే తను ఏమైనా అంటే వెంటనే హర్ట్ అవుతున్నానని అన్నాడు. సంజనతో బాండ్ గురించి మాట్లాడుతూ.. “అమ్మ తప్పు చేసినా తప్పు తప్పని చెప్తాం.. అమ్మని మాత్రం వదిలేయం కదా.. అలానే నేను కూడా ” అని అన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: