బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో రీతూ చౌదరీ ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఊహించని విధంగా రీతూ ఎలిమినేషన్ కంటెస్టెంట్లందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ నేపథ్యంలో షో 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఫైనల్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో హౌజ్‌లోని ప్రతి టాస్క్, ప్రతి నామినేషన్ అత్యంత కీలకంగా మారింది.
Read Also: Bigg Boss 9: హౌస్ నుండి రీతూ ఔట్
150 పాయింట్లతో ఇమ్మూ టాప్-1
సెకండ్ ఫైనలిస్ట్‌తో పాటు ఓట్ అప్పీల్ సొంతం చేసుకునేందుకు ఒకరికి బిగ్‌బాస్ (Bigg Boss 9) ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా టాస్కుల్లో ఇమ్మానుయేల్ మరోసారి ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం లీడర్ బోర్డులో 150 పాయింట్లతో ఇమ్మూ టాప్-1లో ఉండగా డీమాన్ 120, సుమన్ శెట్టి 90, తనూజ 90, భరణి 90, సంజన 80 పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఇంటి సభ్యులు అందరూ కలిసి తర్వాత యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఎవరిని తప్పిస్తున్నారు.. అని అడిగాడు బిగ్‌బాస్.
అప్పటికే అందరూ తెగ చర్చలు చేసేసుకొని ఇమ్మూని తీసేయాలని డిసైడ్ అయ్యారు. సుమన్ లేచి ఇమ్మూ పేరు చెప్పాడు. తర్వాత భరణి కూడా అదే చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్నోళ్లని నేను ఈ ఒక్క గేమ్ తప్పిస్తున్నాను.. ఎందుకంటే ఇమ్మానుయేల్ టాస్క్ పరంగా కూడా బాగా ఆడతాడు.. తను మళ్లీ కమ్ బ్యాక్ చేయగలడు.. అంటూ భరణి చెప్పుకొచ్చాడు.
ఎమోషనల్ అయిన ఇమ్మూ
ఒకవేళ కలిసి రాక నేను కమ్‌బ్యాక్ చేయకుండా లీస్ట్‌లో ఉండి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఒక హగ్గు ఇచ్చి టాటా బైబై చెప్తారు అంతేనా.. అంటూ ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత సంజన మాత్రం ఆట మార్చింది. హౌస్‌లో టఫ్ఫెస్ట్ కాంపిటేషన్ ఇంట్లో డీమాన్-ఇమ్మూ.. ఇద్దరిలో ఒకరి పేరే చెప్పాలి కాబట్టి నేను డీమాన్ పేరు చెప్తున్నా.. అని తన వెర్షెన్ చెప్పింది.
తన దగ్గర హయ్యెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి నేను ఇమ్మానుయేల్‌ని సెలక్ట్ చేస్తున్నా.. అంటూ తనూజ తన పాయింట్ చెప్పింది. నేను సంజన గారు అనుకుంటున్నాను.. కాంపిటేషన్ అన్నప్పుడు కాంపిటేటర్స్‌తో ఆడదాం అనుకుంటున్నాను.. అది ఫెయిర్ ఛాన్స్ అనుకుంటున్నాను.. అంటూ డీమాన్ షాకిచ్చాడు. కళ్యాణ్ కూడా సంజననే సెలక్ట్ చేశాడు.

ఇండైరెక్ట్‌గా సంజననే సెలక్ట్ చేస్తానని చెప్పేశాడు ఇమ్మూ
నేను లేనప్పుడు నేను సపోర్ట్ చేసేవాళ్లు మోస్ట్ డిజర్వింగ్ ఉండాలనుకుంటాను కాబట్టి నేను సంజన గారిని సెలక్ట్ చేస్తున్నాను.. అని కళ్యాణ్ అన్నాడు. సంజన గారు నేను ఇది జరుగుద్దానే మీ ఒక్క ఓటు చాలా ముఖ్యమని చెప్పుకుంటూ వచ్చాను.. నేను మిమ్మల్ని బెదిరించాను అనుకుంటున్నారు.. అని ఇమ్మూ చెప్పాడు. మీరు మీ ఓటు వేయండి చూస్తా అంటూ సంజన అంది.
గేమ్‌లో నేనుండాలా మీరుండాలా అంటే నేను ఏం ఆలోచిస్తాను చెప్పండి.. అని ఇమ్మూ ఇండైరెక్ట్‌గా సంజననే సెలక్ట్ చేస్తానని చెప్పేశాడు. దీంతో బిగ్‌బాస్ ఐయామ్ సారీ నేను నా ఓటు మార్చి ఇమ్మానుయేల్‌కి ఓట్ చేస్తున్నాను.. అంటూ సంజన షాకిచ్చింది.బిగ్‌బాస్ అలాగైతే నేను కూడా నా ఓటు ఇమ్మానుయేల్‌కి మార్చి సంజన గారికి వేస్తున్నాను.. అంటూ తనూజ ప్లేట్ తిప్పేసింది.
గట్టిగా అరిచిన తనూజ
దీంతో ఇక్కడ మాటిచ్చావ్ కదా గుడ్డిగా మాటిచ్చావ్ కదా.. అని సంజన ఫైర్ అయింది. అవును ఇచ్చాను.. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్మానుయేల్‌ని తియ్యలేను నామినేట్ చెయ్యలేను.. అని అంత మాట అనేసి ఇప్పుడు డీమాన్ కాదు ఇమ్మానుయేల్ అని మీరు మార్చేటప్పుడు నేను మరిస్తే తప్పు ఏమైనా ఉందా.. అని తనూజ అరిచింది.
నేను నన్ను నేను కాపాడుకున్నాను.. నీకులా చేయలేదు.. అంటూ సంజన చెప్పింది. నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉన్నాను అందుకే నేను ఇమ్మూకి చేయట్లేదు.. తనూజకి వేశాను అన్నప్పుడు కనిపించలేదా ట్రోఫీ.. అని తనూజ వెక్కిరించింది. తనూజ నీకు నన్ను తియ్యాలని ఉంది.. గోల్డెన్ ఛాన్స్ నో బాల్‌లో సిక్స్ కొట్టు.. వావ్ వాటే పెర్ఫామెన్స్.. బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఆఫ్ బిగ్‌బాస్ సీజన్-9 ఇదే.. అంటూ సంజన ఏకిపారేసింది.
ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు?
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: