
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం RT76, సినీప్రియులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌లుగా ఆషికా రంగనాథ్ (Amigos ఫేమ్), డింపుల్ హయతి (Khiladi ఫేమ్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read also: Movies: ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్
సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు
RT 76 (Bhartha Mahasayulaku Wignyapthi) అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని (Bhartha Mahasayulaku Wignyapthi) సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10 : 30 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం. అనంతరం ప్రసాద వితర జరుగుతుందంటూ.. పంతులు వాయిస్ ఓవర్‌తో సాగే మాటలతో షురూ అయింది గ్లింప్స్. అనంతరం ఈ అనౌన్స్‌మెంట్ మనలో చాలా మంది చాలా సార్లు వినుంటాం.
ఇప్పుడు నాకిది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, జెమినీ, చాట్ జీపీటీ ఇలా అన్నింటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా అయోమయానికి గురిచేశాయి అంటూ రవితేజ (Ravi Teja) వాయస్ ఓవర్‌తో సాగుతున్న వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :