టాలీవుడ్‌లో కామెడీ టైమింగ్‌కు పెట్టింది పేరైన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) పేరు ముందుంటుంది. వెంకీ (Venky), దుబాయ్ శీను (Dubai Seenu), కిక్ (Kick) వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ఆ సినిమాల్లో రవితేజ చూపించిన సహజమైన హాస్యం, ఎనర్జీ, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కాలం మారేకొద్దీ రవితేజ సినిమాల ఎంపిక కూడా మారింది. గత కొన్నేళ్లుగా ఆయన వరుసగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా లతోనే ప్రేక్షకుల ముందుకువచ్చారు.
Read also: Yami Gautam: ‘హక్’ మూవీ పై సమంత ఏమన్నారంటే?
ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందినా, అభిమానులు మాత్రం రవితేజ నుంచి ఒక పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.అయితే ఈ సంక్రాంతికి మాత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫ్యామిలీ సినిమాతో వచ్చారు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ చేసిన ఈ సినిమాలో ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.
కథ విషయానికి వస్తే..
రామ్ సత్యనారాయణ అలియాస్ రవితేజ (Ravi Teja) ఒక వైన్‌యార్డ్ ఓనర్. తన బిజినెస్ కి సంబంధించిన ఒక విషయంపై, తన పీఏ లీలా (వెన్నెల కిశోర్)తో కలిసి స్పెయిన్ వెళతాడు. అక్కడ మానస శెట్టి (ఆషిక రంగనాథ్) ను పట్టుకుంటే తన బిజినెస్ కి హెల్ప్ అవుతుందని భావిస్తాడు. అయితే ఆమెకీ .. తనకి మధ్య విందా (సత్య) ఉన్నాడనే విషయం రామ్ సత్యనారాయణకు అర్థమవుతుంది. దాంతో తెలివిగా ప్లాన్ చేసి, సత్య పేరుతో మానసకి పరిచయమవుతాడు.
విందా నిజస్వరూపం ఆమెకి తెలిసేలా చేసి, తన పట్ల ఆమెకి నమ్మకం కలిగేలా చేస్తాడు.మానస అందంగా ఉండటంతో సత్య ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు. తనకి బాలామణి (డింపుల్ హయతి)తో పెళ్లైందనే విషయం చెప్పకుండా, మానసకి దగ్గరవుతాడు. తాను బిజినెస్ పనిపై వచ్చాననే విషయం కూడా చెప్పకుండా హైదరాబాద్ కి తిరిగి వచ్చేస్తాడు. రామ్ అంటే భార్య బాలామణికి విపరీతమైన ప్రేమ .. అంతకుమించిన నమ్మకం.

భర్త అంటే ఎలా ఉండాలి? అనే ప్రశ్నకి తన భర్తను సమాధానంగా చూపిస్తూ ఉంటుంది. పరస్త్రీల పట్ల ఆకర్షితులయ్యేవారిని ఆమె అసహ్యించుకుంటూ ఉంటుంది.తన పట్ల బాలామణికి గల విపరీతమైన నమ్మకాన్ని చూసినప్పుడల్లా రామ్ అపరాధనా భావానికి లోనవుతూ ఉంటాడు. ఆమెకి నిజం చెబితే ఏమైపోతుందోనని భయపడుతూ ఉంటాడు.
అలాంటి పరిస్థితులలో తన బిజినెస్ కి సంబంధించిన పనిపై హైదరాబాద్ లో ఒక 10 రోజుల పాటు ఉండటానికి మానస వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? సత్య పేరుతో రామ్ ఆడిన నాటకం బయటపడుతుందా? మానస – బాలామణి వలన రామ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ.
కథనం
ముందు చెప్పుకున్నట్లుగా ఇదేం కొత్త స్టోరీ కాదు కానీ ఈ లైన్‌తో కథ రాసినప్పుడు చాలా నేచరుల్‌గానే కామెడీ జనరేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ కామెడీకి కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, కంగారు తోడైతే థియేటర్లో జనాలు నవ్వడం కూడా చాలా నేచురల్. అందులోనూ సంక్రాంతి లాంటి పండగకి థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి ఇలాంటి సబ్జెక్ట్ తప్పకుండా నవ్వులు పూయిస్తుంది. ఈ పాయింట్‌ని డైరెక్టర్ కిషోర్ తిరుమల బాగా వర్కవుట్ చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: