కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డు (Central Government 71st National Film Awards)లను ప్రకటించింది. ఈసారి బాలీవుడ్, టాలీవుడ్ సహా, పలు భాషల చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. హిందీ చిత్రం ‘12th ఫెయిల్’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.ఉత్తమ నటుడు అవార్డు ,షారుఖ్ ఖాన్ (జవాన్) మరియు విక్రాంత్ మాసే (12th ఫెయిల్) పంచుకున్నారు. ఉత్తమ నటి అవార్డు రాణీ ముఖర్జీకి, (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) దక్కింది.టాలీవుడ్ నుంచి ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘హనుమాన్’ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు సాధించింది. ‘బలగం’ సినిమాలోని ‘ఉరు-పల్లెటూరు’ పాట జాతీయ ఉత్తమ గీతంగా ఎంపికైంది. జీవీ ప్రకాశ్ కుమార్ (వాత్తి) ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు.

‘బేబీ’ చిత్రానికి ఘనత
టాలీవుడ్ హిట్ సినిమా ‘బేబీ’ రెండు అవార్డులు గెలుచుకుంది. దర్శకుడు సాయి రాజేశ్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఎంపికయ్యారు. అలాగే పీవీఎన్ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా పురస్కారం పొందారు.
ఇతర విభాగాల విజేతలు
ఉత్తమ సహాయ నటుడు: విజయ రాఘవన్ (పూక్కాలం), ముత్తుపెట్టాయ్ సోము భాస్కర్ (పార్కింగ్)
ఉత్తమ సహాయ నటి: ఊర్వశి (ఉల్లుకు), జానకీ బోడివాలా (వష్)
ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)
ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
ఉత్తమ కన్నడ చిత్రం: కండీలు
ఉత్తమ హిందీ చిత్రం: కథల్
సాంకేతిక విభాగాల్లో అవార్డులు
ఉత్తమ నేపథ్య సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్ (యానిమల్)
ఉత్తమ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: సామ్ బహదూర్
ఉత్తమ ఎడిటింగ్: మిధున్ మురళి (పూక్కాలం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పసంతను మొహపాత్రో (ది కేరళ స్టోరీ)
బాలల విభాగం, ప్రత్యేక పురస్కారాలు
ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతివేణి (గాంధీతాత చెట్టు) సహా మరికొందరు
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: ఆశిష్ బెండే (ఆత్మపాంప్లెట్)
నాన్-ఫీచర్ విభాగం
ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రం: ప్లవరింగ్ మ్యాన్ (హిందీ)
ఉత్తమ ఆర్ట్స్/కల్చర్ చిత్రం: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
ఉత్తమ బయోగ్రాఫికల్ చిత్రం: మా బావు, మా గావ్ (ఒడిశా)
టాలీవుడ్‌కు గర్వకారణం
ఈ ఏడాది అవార్డుల్లో తెలుగు చిత్రాలకు మంచి గుర్తింపు లభించింది. భగవంత్ కేసరి, హనుమాన్, బలగం, బేబీ వంటి చిత్రాలు టాలీవుడ్ ప్రతిభను మరోసారి నిరూపించాయి.
Read Also : 71st National Film Awards 2025: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో దుమ్ములేపిన తెలుగు చిత్రాలు