
అంకిత్ కొయ్య నీలఖి జంటగా నటించిన ప్రేమకథా చిత్రమే (Beauty Movie) బ్యూటీ. జెఎస్ ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా, జనవరి 2వ తేదీ నుంచి ‘జీ 5’లో (‘Zee 5’) స్ట్రీమింగ్ అవుతోంది.
Read also: Srinivasa Mangalapuram: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్
కథ
(Beauty Movie) నారాయణ (నరేశ్) జానకీ (వాసుకీ) భార్యాభర్తలు. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ల కూతురే అలేఖ్య (నీలఖి). వైజాగ్ లో నారాయణ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ, అలేఖ్యను ఇంటర్ చదివిస్తూ ఉంటాడు. అలేఖ్య అంటే అతనికి ప్రాణం .. అందువలన ఆమె అడిగినవన్నీ కొనిస్తూ ఉంటాడు. ఆర్ధికపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ, తన కష్టం కూతురికి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటాడు.
నారాయణ భార్య జానకీ కూడా ఉన్నదాంట్లో సర్దుకుపోతూ ఇల్లు గడుపుతూ ఉంటుంది. కొత్త మోపెడ్ కొనాలని అలేఖ్య తండ్రిని పోరుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలోనే ఆమెకి అర్జున్ (అంకిత్ కొయ్య)తో పరిచయమవుతుంది. అలేఖ్యకు మోపెడ్ నేర్పే సాకుతో ఆమెకి అర్జున్ మరింత చేరువవుతాడు. అలా వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఒక రోజున ఆమె అర్జున్ తో వీడియో కాల్ మాట్లాడుతూ తల్లికి దొరికిపోతుంది. తల్లి మందలించడంతో, తండ్రికి కూడా తెలిసిపోతుందని భయపడుతుంది. అర్జున్ తో కలిసి హైదరాబాద్ వెళ్లిపోతుంది.
ఇదిలా ఉండగా వైజాగ్ లోనే రోహిత్ అనే ఒక రౌడీ ఉంటాడు. అతను ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకుని, వారికి సంబంధించిన వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. వాళ్ల నుంచి డబ్బు .. బంగారం లాగుతూ ఉంటాడు. అలాంటి రోహిత్ కన్ను, అలేఖ్యపై పడుతుంది. దాంతో అతను ఆమెను ఫాలో అవుతూ, ఆ ప్రేమజంటతో హైదరాబాద్ చేరుకుంటాడు. తన కూతురును వెతుక్కుంటూ నారాయణ కూడా హైదరాబాద్ వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? నారాయణ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.
పనితీరు
ఈ కథను ఇటు వైజాగ్ అటు హైదరాబాద్ నేపథ్యంలో దర్శకుడు డిజైన్ చేసుకున్నాడు. చివరి 30 నిమిషాలలో వచ్చే ట్విస్ట్ కథను మరింత బలోపేతం చేస్తుంది. ఎక్కడా అతికించినట్టు కాకుండా, అక్కడక్కడా ఎమోషన్స్ ను తట్టి లేపుతూ కన్నీళ్లు పెట్టిస్తుంది.
ముగింపు
బంధాలను అర్థం చేసుకోవడంలో అనుబంధాలకు విలువనీయడంలోనే అసలైన ‘బ్యూటీ’ ఉందని చాటిచెప్పిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: