హైదరాబాద్‌లో మెగా అభిమానులు అత్యవసర సమావేశం నిర్వహించారు. బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్‌లో ఆంధ్ర, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో బాలకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సోమవారం జూబ్లీహిల్స్, మంగళవారం ఏపీ, తెలంగాణలోని 300 పీఎస్‌లలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జోక్యం చేసుకున్నారు. అభిమానులను ఆపుతూ, అలాంటి చర్యలకు పోవద్దని సూచించారు. ఆయన పిలుపుతో అభిమానులు వెనక్కి తగ్గినా, పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ మాట్లాడుతూ, మరో రెండు రోజుల్లో మళ్లీ సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
OG Collections : ‘OG’ 4 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

అసెంబ్లీ వ్యాఖ్యలే వివాదానికి కారణం
ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలం. గత ప్రభుత్వం సినీ ప్రముఖులను తాడేపల్లికి ఆహ్వానించినప్పుడు బాలకృష్ణ పేరు జాబితాలో లేదని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా ప్రశ్నించారని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు.చిరంజీవి కారణంగా జగన్ వెనక్కి తగ్గారన్న కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. అవి పూర్తిగా అబద్ధమని, ఎవరూ గట్టిగా అడగలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం కూడా తనను FDC సమావేశం జాబితాలో 9వ స్థానంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి లేఖతో దుమారం
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి (Chiranjeevi on Balakrishna’s comments) విదేశాల నుంచి లేఖ ద్వారా స్పందించారు. గత ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల సమయంలో జరిగిన విషయాలను వివరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన లేఖ వివాదాన్ని మరింత ముదిర్చింది. దీంతో ఈ వ్యవహారం టాప్ లెవెల్‌కు చేరింది.వైసీపీ నేతలు కూడా ఈ రచ్చలోకి దిగారు. అనవసరంగా తమ నాయకుడి పేరు ప్రస్తావించారని మండిపడ్డారు. బాలకృష్ణకు నేరుగా వార్నింగ్‌లు ఇచ్చారు. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు సంతరించుకుంది.
మెగా అభిమానుల కొత్త నిర్ణయం
ఈ పరిణామాల మధ్య మెగా అభిమానులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఫిర్యాదు చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. చిరంజీవి ఆపిన తర్వాత వెనక్కి తగ్గినా, మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం ఉత్కంఠ రేపుతోంది.ఇక మరో ట్విస్ట్‌గా కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలు సభ రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అయితే ఆయన వ్యాఖ్యలతో చెలరేగిన మంటలు ఆగేలా లేవు. అభిమానుల మీటింగ్, వారు తీసుకున్న నిర్ణయం ఈ వివాదం ఇంకా కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తోంది.
Read Also :