నందమూరి బాలకృష్ణ కెరీర్ నాలుగు దశాబ్దాలు దాటినా జోరు తగ్గలేదు. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బాలయ్య, ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 చిత్రంలో నటిస్తున్నారు.వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సమాచారం. బాలకృష్ణ ఇందులో రెండు విభిన్న కాలాల్లో కనిపించే పాత్రలు చేయనున్నారని, అందులో ఒకటి రాజుగా ఉండే పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది.
Read also: Rashi comments on Anasuya : అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు
ఊహాగానాలు
ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చియి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండడం వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. గత ఏడాది నవంబర్ 26న నయనతారను హీరోయిన్‌గా అధికారికంగా పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్, నయనతార అధిక రెమ్యునరేషన్ దీనికి కారణమని టాక్. ఇంకొక హీరోయిన్ అయితే రెండు కోట్లతో అయిపోతుందని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: