हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Bahubali: బాహుబ‌లి రీ రిలీజ్ ఎప్పుడంటే?

Ramya
Bahubali: బాహుబ‌లి రీ రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్థాయిని మార్చిన బాహుబ‌లి

తెలుగు చిత్రపరిశ్రమలో ఓ విప్లవాత్మకమైన మలుపుగా నిలిచిన చిత్రం బాహుబ‌లి. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో, ప్ర‌భాస్ న‌ట‌న‌లో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై భారతీయ సినిమా రేంజ్‌ని అంతర్జాతీయంగా తీసుకెళ్లింది. బాహుబ‌లి చిత్రం విడుద‌లైన త‌ర్వాత టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్‌, విజువ‌ల్ వండ‌ర్స్, ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ వంటి ట్రెండ్స్ మొద‌ల‌య్యాయి. ఈ సినిమాతో పాటు తెలుగు సినిమాల స్థాయీ, గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప‌ట్టు కూడా పెరిగింది.

రీ-రిలీజ్‌తో మళ్లీ బాహుబ‌లి ప్రభంజనం?

2025 అక్టోబర్ నాటికి బాహుబలి సినిమాకి పదేళ్లు పూర్తి కావోతున్న సందర్భంలో మేకర్స్ ఈ చిత్రాన్ని పునః విడుదల (రీ రిలీజ్) చేయబోతున్నారు. ముందుగానే అధికారిక ప్రకటన రావడం చూస్తే ఈసారి ప్రమోషన్స్ మరింత ఘనంగా ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు. బాహుబ‌లి రీ రిలీజ్‌కి టాలీవుడ్‌లో మ‌రో సెన్సేష‌న్ ఖాయ‌మ‌నే ఊహాగ‌ణ‌న‌లు మొద‌ల‌య్యాయి.

రీ-రిలీజ్ హిట్ ట్రెండ్‌ను బాహుబ‌లి కొనసాగిస్తుందా?

ఇటీవ‌ల కాలంలో పలు తెలుగు క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదలై మంచి విజయం సాధించాయి. మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్, భద్రి, హ్యాపీ డేస్, ఓయ్, ఆరెంజ్ వంటి చిత్రాలు రీ రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్‌తో పాటు కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఇప్పుడు అదే దారిలో బాహుబ‌లి కూడా అడుగులు వేస్తోంది.

అప్ప‌ట్లో “క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్నతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి-2, బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఘనత సాధించింది. ఇప్పుడు అదే సినిమా మ‌ళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈసారి కూడా రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

గ్రాస్ వసూళ్లలో సరికొత్త లక్ష్యాల వైపు?

ఇప్ప‌టి వ‌ర‌కు రీ రిలీజ్ చ‌రిత్ర‌లో విజయ్ నటించిన గిల్లీ చిత్రం 32 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి టాప్‌ ప్లేస్‌లో ఉంది. మరి ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి ఈసారి 100 కోట్ల గ్రాస్‌ను సాధించగలదా? అనేది ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అది జరిగితే రీ రిలీజ్ సినిమాల్లో “నాన్ బాహుబ‌లి రికార్డు” అనే కొత్త కేటగిరీ మొదలవుతుంది.

గ్లోబల్ సినిమాకు మార్గం వేసిన చిత్రం

బాహుబలి మాత్రమే కాకుండా, దానితో పాటు న‌టించిన ప్రతి ఒక్క‌రికి ఈ సినిమా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా పాన్ ఇండియా గుర్తింపు పొందగా, ప్ర‌భాస్ కూడా అంత‌ర్జాతీయ స్థాయిలో స్టార్‌గా మారాడు. బాహుబ‌లి త‌ర్వాత తెలుగు సినిమా వైపు బాలీవుడ్‌తో పాటు ప‌లు ఇతర భాష‌ల సినీ పరిశ్రమల దృష్టి మళ్లింది.

read also: Mohanlal: ‘తుడరుమ్’ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870