‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీస్ దగ్గర రూ. 53 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Dandora Movie: ‘దండోరా’ మూవీ రివ్యూ

ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్
ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. 8 వారాల తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది..ఈ ఎపిక్ వెర్షన్‌లో సూమారు 90 నిమిషాలు తగ్గించారు. అనవసరమైన సాగతీత లేకుండా, కేవలం కథలోని కీలక మలుపులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్‌ను మాత్రమే ఉంచి ఈ ఎడిట్‌ను సిద్ధం చేశారు. థియేటర్లలో ఈ వెర్షన్‌కు విశేష స్పందన రావడంతో, ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: