మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ – కామెడీ ఎంటర్‌టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
Read Also: Suriya new movie : సూర్య–జితు మాధవన్ కొత్త సినిమా ప్రారంభం…
ఈ సందర్భంగా ఆయన చిరంజీవి మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి ఇంట్రో సాంగ్ షూటింగ్ జరుగుతోందని, ఈ పాటకు ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని వెల్లడించారు. ఈ సినిమా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచినట్లు తెలిపారు.

‘వారణాసి’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు
ఇటీవల విడుదలైన ‘శశిరేఖ’ పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని, చిరంజీవి–నయనతార జోడీని వెండితెరపై మరోసారి అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తారని అనిల్ చెప్పారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల విడుదలైన ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్‌ను చూసి తాను పూర్తిగా షాక్‌కు గురయ్యానని అనిల్ తెలిపారు. ప్రతి షాట్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెలర్‌లా అనిపించిందని పేర్కొన్నారు. క్రియేటివిటీ ఇంత భారీ స్థాయిలో ఉంటుందని తాను ఊహించలేదని, ఈ రేంజ్ ఐడియాలు రాజమౌళికే సాధ్యమని వ్యాఖ్యానించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: