
టాలీవుడ్‌లో ఒక ఎనర్జిటిక్ స్టార్గా పేరొందిన రామ్ పోతినేని తాజా ప్రాజెక్ట్‌తో తన అభిమానులను ఉత్కంఠకు లోనుచేశారు. ఆయన హీరోగా, పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka Movie). పి. మహేష్ బాబు, గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి విజయవంతమైన చిత్రాలను దర్శకుడిగా అందించిన అనుభవం ఉన్న ఆయన, ఈ కొత్త చిత్రంలో కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్మెంట్ తో అలరించనున్నారు.
Kalaimamani Awards 2025: కలైమామణి అవార్డ్స్ అందుకున్న సినీప్రముఖులు
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పరుస్తోంది. సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ గ్రూప్స్‌లో ఇప్పటికే రామ్ పోతినేని ఫ్యాన్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం వేచి ఉన్నాయి.
ప్రముఖ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు
వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ (Teaser) ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో రామ్.. ఒక సూపర్ స్టార్‌కి వీరాభిమానిగా కనిపించనున్నారు.
కన్నడ స్టార్ ఉపేంద్ర గారు పోషించిన ‘ఆంధ్రా కింగ్’ (Andhra King Taluka Movie) పాత్రకు రామ్ ఎంతటి డైహార్డ్ ఫ్యాన్ అనే అంశాన్ని టీజర్ హైలైట్ చేసింది.రామ్ పోతినేని ఎనర్జీ, మాస్ డైలాగ్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: