తెలుగు సినిమా ప్రేక్షకుల్లో హుషారెత్తించే కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka Movie) ప్రస్తుతం భారీ అంచనాలు సొంతం చేసుకుంది. యువతకు ప్రత్యేక క్రేజ్ ఉన్న రామ్ పోతినేని (Ram Pothineni) ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మహేష్‌బాబు.పి నడిపిస్తుండగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోంది.
సినిమాలో హీరోయిన్‌గా కొత్తగా పరిచయమవుతున్న భాగ్యశ్రీ భోర్సే (Bhagyashree Bhorse) నటిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు మరింత విశిష్టత తీసుకొచ్చిన అంశం. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్‌స్టార్ ఉపేంద్ర (Superstar Upendra) ఇందులో కీలకపాత్రలో నటించడం. తెలుగు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్ర ప్రత్యేకమైన లుక్, శక్తివంతమైన పాత్రలతో ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటుంటాడు.

ఈ రోజు ఉపేంద్ర పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీమ్ ఓ కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో ఉపేంద్ర తన నిజ జీవిత ఇమేజ్‌కి దగ్గరగా ఉండే ‘సూపర్‌స్టార్ ఆంధ్ర కింగ్ సూర్యకుమార్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఉపేంద్ర అభిమానులను ఇది అమితంగా ఆకట్టుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: