Rashi comments on Anasuya : టాలీవుడ్‌లో మరోసారి మహిళలపై వ్యాఖ్యల అంశం పెద్ద వివాదంగా మారింది. సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించి శివాజీకి నోటీసులు జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ఈ అంశంపై నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. మహిళలకు ఏం ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి తప్పు సందేశం ఇస్తాయని ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలని ఆమె వ్యాఖ్యానించారు.
అనసూయ వ్యాఖ్యలకు మద్దతుగా చిన్మయి వంటి పలువురు ప్రముఖులు కూడా శివాజీపై విమర్శలు గుప్పించారు. అయితే మరోవైపు కొందరు మాత్రం శివాజీని సమర్థిస్తూ, ఆయన ఉద్దేశం తప్పుగా లేదని, సమాజంలో డ్రెస్ సెన్స్‌పై చర్చ జరగడం సహజమేనని వాదిస్తున్నారు.
Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య
ఈ వివాదంలోకి తాజాగా సీనియర్ నటి రాశి (Rashi comments on Anasuya) కూడా స్పందించారు. శివాజీ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసునని, ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు కాదని, అయితే కొన్ని పదాలు తప్పుగా బయటకు వచ్చాయని రాశి తెలిపారు. ఆ విషయంలో శివాజీ ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పారని ఆమె పేర్కొన్నారు.
అనసూయ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన రాశి, నాలుగేళ్ల క్రితం ఓ టీవీ షోలో తన పేరును ఫన్నీగా ఉపయోగించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాశి ఫలాలు’ అనే పదాన్ని ‘రాశి గారి ఫలాలు’గా చెప్పి నవ్వుకున్నారని, మైక్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని పేరు చెప్పకుండా అనసూయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: