టాలీవుడ్ మెగా కుటుంబంలో మరో శుభసందర్భం ఏర్పడింది. అల్లు అర్జున్ తమ్ముడు, యువ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన నయనిక రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ శుభకార్యం శుక్రవారం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా, సన్నిహితుల సమక్షంలో జరిగింది. రెండు కుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.
Read Also: Mass Jathara Review: రవితేజ మాస్ జాతర – ఎనర్జీ పేలింది, కథ బలహీనం!

నిశ్చితార్థ వేడుకలో అల్లు శిరీష్–నయనిక రెడ్డి (Allu Sirish) ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ జంటను ఆశీర్వదించేందుకు మెగా కుటుంబం మొత్తం హాజరైంది. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత నాగబాబు, హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, హీరో వరుణ్ తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ మొదలైన వారు వేడుకలో పాల్గొని సందడి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: