టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి అభిమానులతో పాటు సినీ ప్రముఖులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాడు. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ (Atlee) బర్త్‌డే సందర్భంగా బన్నీ తన అభిమాన శైలిలోనే హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపాడు. సెప్టెంబర్ 21న అట్లీ జన్మదినం కావడంతో అల్లు అర్జున్ ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ప్రత్యేక సందేశం పోస్టు చేశాడు.
“హ్యాపీ బర్త్‌డే అట్లీ. ఈ సంవత్సరం నీకు ఎంతో గొప్పదిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. నువ్వు సృష్టిస్తున్న ఆ మ్యాజికల్ సినిమాటిక్ అనుభూతిని చూసే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని బన్నీ తన సందేశంలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్‌తో కలిసి
అట్లీ గతంలో ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) నటించిన ‘జవాన్’ సినిమా (‘Jawaan’ movie) తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దీపిక పదుకొనే (Deepika Padukone) కథానాయికగా నటిస్తుండగా.. సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: